'కల్కి 2898 AD.' చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కాశి ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి ప్రపంచంలో బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్ మరియు దీపికా పదుకొణే ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ముంబైలో జరిగిన సెన్సార్ స్క్రీనింగ్ లో ఈ చిత్రాన్ని 3డీలో ప్రదర్శించగా, సెన్సార్ సభ్యుల నుంచి కొన్ని కామెంట్స్ బయటకు వచ్చాయి.
సినిమాకు అద్భుతమైన విజువల్స్‌కి మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభకు మంత్ర ముగ్దులయ్యారని సమాచారం. భారతీయ తెరపై ఎప్పుడూ చూడని ఈ విజువల్స్ చూసి, వారు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారని తెలుస్తోంది. కథనంలో కొత్తదనం, వినూత్నత చిత్ర విజయానికి ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు. స్టార్స్ నటన అద్భుతంగా ఉందని, ముఖ్యంగా భైరవ పాత్రలో ప్రభాస్ ఆకట్టుకున్నారని, ఆయన యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు అందుకున్నాయి. అలాగే ప్రేక్షకులను థ్రిల్ చేసేలా కొన్ని స్టార్ కెమియోలు ఆకర్షణగా ఉంటాయని, క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కూడా అద్భుతంగా మైమరపించనుందని అంటున్నారు. ఈ చిత్రం సుమారు 2 గంటల 58 నిమిషాల నిడివితో యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. మరి ఈ సినిమా విడుదల అనంతరం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment