కల్కి 2898AD: విడుదలకు ముందే బాక్సాఫీస్ కు దెబ్బ


టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం పెద్దగా సందడేమీ లేదు. గత కొన్ని వారాలుగా వరుసగా పేరున్న సినిమాలు రిలీజైన్నప్పటికి ప్రాఫిట్స్ లోకి అయితే రాలేదు. కేవలం తమిళ్ సినిమా మహారాజ తెలుగులో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక ఈ వారం మాత్రం పెద్ద సినిమాలు లేవు. చిన్న సినిమాలైన ‘నింద’, ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’, ‘ఓఎంజీ’, ‘సీతారామ వైభోగమే’, ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’, ‘సందేహం’, ‘పద్మవ్యూహంలో చక్రధారి’ వంటి చిత్రాలు వాటి అదృష్టం పరీక్షించుకుంటున్నాయి.


ఈ చిత్రాల్లో కొంతమంది మాత్రమే పేరున్న సెలబ్రెటీలు, దీంతో పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం లేదు. ప్రత్యేకంగా ‘హ్యాపీ డేస్’ ఫేమ్ వరుణ్ సందేశ్ నటించిన ‘నింద’ ప్రోమోలు మాత్రమే కొంతమంది దృష్టిని తాకాయి. థ్రిల్లర్‌గా కనిపిస్తున్న ఈ చిత్రం టాక్ బాగుంటేనే గాని పెద్దగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేదని అనిపిస్తోంది. ఆడియెన్స్ థియేటర్లకు రాకపోవడానికి ముఖ్య కారణాల్లో కల్కి ఒకటి.

టిక్కెట్ల రేట్లు ఎక్కువవ్వడం, ఫ్యామిలీతో వేలల్లో ఖర్చులు ఉంటాయి కాబట్టి కల్కి లాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి సినిమాకు వెళితేనే బెటర్ అనే ఆలోచన వలన ముందు వారం వస్తున్న సినిమాలపై ఆ ప్రభావం అయితే ఉంటుంది. ఈ రోజుల్లో యావరేజ్ టాక్ వచ్చినా కూడా కమర్షియల్ లెక్కల ప్రకారం డిజాస్టర్ గానే తేలిపోతున్నాయి. ఇక కల్కి అయినా బాక్సాఫీస్ కు పునకాలు తెప్పిస్తుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post