జూనియర్ ఎన్టీఆర్ "దేవర" అక్టోబర్ 10న విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే మంచి హైప్ ఉంది. టైటిల్ సాంగ్ చార్ట్ బస్టర్ అవ్వడం, మెలోడీ డ్యూయెట్ విడుదలకు సిద్ధంగా ఉండటం వల్ల సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఎన్టీఆర్ గతంలో ఎప్పుడూ లేనంత హై వోల్టేజ్ సినిమాతో రాబోతున్నాడు.
(అయితే, అదే రోజున రజనీకాంత్ నటించిన "వెట్టయన్" చిత్రం కూడా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీజె జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. "జైలర్" వంటి బ్లాక్ బస్టర్ తరువాత రజనీకాంత్ నుండి వస్తున్న ఈ చిత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో "దేవర" కోసం తీవ్ర పోటీని తీసుకురానుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో రజనీ ప్రభావం ఉన్నందున, "దేవర"కి అక్కడ థియేటర్ దొరకడం కష్టతరమవుతుంది. ఈ కాంపిటీషన్ పై ఎన్టీఆర్ రిస్క్ చేస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అసలే పాన్ ఇండియా సినిమా. ఎన్టీఆర్ అయితే సోలో రిలీజ్ కోసమే చూస్తున్నాడు. ఒకవేళ OG వాయిదా పడితే సెప్టెంబర్ చివరలో దేవర రావచ్చని టాక్ వస్తోంది.
Follow
Post a Comment