ఆచార్య తరహాలోనే కాజల్ కు మరో దెబ్బ

 


కమల్ హాసన్ ప్రస్తుతం తన తాజా సినిమా "ఇండియన్ 2" ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అనిరుధ్ సంగీతం అందించారు. కానీ, ఈ ఈవెంట్‌లో దర్శకుడు శంకర్ కాజల్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో నటించే అవకాశాన్ని పొందారు.


అయితే, కాజల్ అభిమానులకు నిరాశ కలిగించే విషయం ఏమిటంటే, ఆమె "ఇండియన్ 2"లో కనిపించరు. కాజల్ "ఇండియన్ 3"లో మాత్రమే ఉంటారని శంకర్ వెల్లడించారు. ఈ వార్త కాజల్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. గతంలో ఆచార్య సినిమాలో కూడా కాజల్ యాక్ట్ చేసినప్పటికీ ఆమె నటించలేదు. ఇక ఇప్పుడు మరో బిగ్ మూవీలో కొన్ని సీన్స్ చేసినప్పటికీ మూడవ పార్ట్ కు మాత్రమే ఆ క్యారెక్టర్ ను సెట్ చేశారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్, సింబు, సిద్ధార్థ్ తదితరులు కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శంకర్ టీం ఇప్పటికే రెండు భాగాల షూటింగ్ పూర్తి చేసింది. విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు, కాజల్ తెలుగులో తన తదుపరి చిత్రం "సత్యభామ" విడుదల కోసం సిద్ధంగా ఉంది. 

Post a Comment

Previous Post Next Post