దిల్ రాజు ప్రతీ సంక్రాంతికి ఒక సినిమాను విడుదల చేయడం ఆచారంగా పాటిస్తున్నారు. లేదంటే పెద్ద హీరో సినిమాను డిస్ట్రిబ్యూషన్ ద్వారా కవర్ చేయడం అలవాటే. ఈ పండక్కి గుంటూరు కారాన్ని ఎక్కువ రేట్లకు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా అదే ప్రయత్నంలో భాగం. కానీ ఆ సినిమా అనుకున్నంతగా ప్రాఫిట్స్ ఇవ్వలేదు. అయితే, ఈసారి ఎలాంటి సమస్యలు లేకుండా SVC నుండి ఒక సినిమా విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించారు.
మొదట, ఆశిష్ హీరోగా కొత్త దర్శకుడు తీసిన 'శతమానం భవతి నెక్స్ట్ పేజీ'ను ప్లాన్ చేశారు. కానీ చిరంజీవి 'విశ్వంభర', అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ', రవితేజ - భాను భోగవరపు కాంబోలతో పోటీకి సమర్థంగా ఉండదనే ఆలోచన వచ్చి, వెంకటేష్ - అనిల్ రావిపూడి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. వెంకటేష్ ప్రస్తుతం 'రానా నాయుడు 2' వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాతే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. జూన్‌ను మినహాయిస్తే, చేతిలో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో చిత్రీకరణను పూర్తిచేసి, డిసెంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయడం అనిల్ రావిపూడికి కష్టం కానప్పటికీ, దిల్ రాజు మాత్రం ఈ డెడ్‌లైన్‌ను అందుకోవాలని పట్టుదలగా ఉన్నారు. మరి 2025 సంక్రాంతికి దిల్ రాజు హ్యాండ్ ఎలా ఉంటుందో చూడాలి.
Follow
Post a Comment