సినిమాలు పాలిటిక్స్ అనేవి ఎప్పుడో ఒకప్పుడు ఒక లైన్ లోనే వెళుతూ ఉంటాయి. ఇక సినీ తారలు చాలామంది పాలిటిక్స్ లోకి రావాలని అనుకుంటారు. ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా కొంతమంది లీడర్స్ గా మారి సక్సెస్ అవ్వాలని అనుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ దేశమంతా చూసేలా గెలిస్తే మరికొందరు దారుణంగా ఓడిపోయారు. ఇక ఎవరెవరు గెలిచారు? ఎవరెవరు ఓటమి చెందారు అనే వివరాల్లోకి వెళితే..
2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి విజయం సాధించారు. పిఠాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన 70 వేల మెజారిటీతో గెలిచారు. 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాల్లో కూడా జనసేన విజయకేతనం ఎగరవేసింది. ఇక బాలకృష్ణ హిందూపురం నుంచి 32,597 ఓట్లతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ మండి లోక్ సభ స్థానం నుంచి 74,755 ఓట్లతో గెలిచారు.
మలయాళ నటుడు సురేష్ గోపీ కేరళలోని త్రిసూర్ లోక్ సభ స్థానంలో 74,686 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భోజ్‌పురి నటుడు రవి కిషన్ ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ లో 103,526 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అరుణ్ గోవిల్ మీరట్ లో 10,585 ఓట్లతో గెలిచారు. రచనా బెనర్జీ పశ్చిమ బెంగాల్ హుగ్లీ లో 76,853 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తమిళనాడు విరుదునగర్‌లో BJP నుంచి పోటీ చేసిన రాధికా శరత్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో ఓటమి చెందారు. కానీ ఆమెకు లక్షన్నరకు పైగా ఓట్లు రావడం గ్రేట్.
శత్రుజ్ఞ సిన్హా పశ్చిమ బెంగాల్ అసన్‌సోల్ లో 59,564 ఓట్లతో గెలిచారు. హేమమాలిని యూపీ మధుర లో 293,407 ఓట్లతో భారీ విజయం సాధించారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ షిమోగా లో ఓడిపోయారు. రోణా, నవనీత్ కౌర్ కూడా ఓటమి చవిచూశారు.
Follow
Post a Comment