న్యాచురల్ స్టార్ నాని, 'బలగం' ఫేమ్ వేణు యెల్దండితో కలిసి ఒక ప్రాజెక్ట్‌పై నెలల తరబడి చర్చలు జరిపారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు. ఈ ప్రాజెక్ట్ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా, గతంలో దిల్ రాజు ప్రైవేట్ ఈవెంట్స్‌లో దీని గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం దిల్ రాజు సెలవుల్లో అమెరికాలో ఉండగా, ఆయన టీమ్ ఇక్కడి పనులను చూసుకుంటున్నారు. ఎల్లమ్మ అనే వర్కింగ్ టైటిల్ తో, వేణు పీరియాడిక్ డ్రామాగా కథను తయారు చేశారు.
నలభై ఏళ్ల క్రితం ఒక గ్రామంలో జరిగిన నిజమైన ప్రేమకథను ఆధారంగా తీసుకున్న ఈ కథలో వయొలెన్స్ తో పాటు ఎమోషన్ కూడా ఉంది. తాజాగా, ఈ ప్రాజెక్ట్ పూర్తిగా క్యాన్సిల్ అయ్యిందనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి లభిస్తున్న సమాచారం మేరకు, వేణు రూపొందించిన కథ గ్రామీణ నేపథ్యంలో విభిన్నంగా ఉన్నప్పటికీ, నాని దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే చిత్రంలో కొన్ని పాయింట్లు ఒకే తరహాలో ఉన్నాయట. అలాగే నెరేషన్ విషయంలో పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ కథ నానికి పూర్తిగా సూట్ కాకపోవడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం.
వేణు యెల్దండికి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం పెద్ద దెబ్బే. బలగం తర్వాత పెద్ద హీరోతో సినిమా చేయాలని ఆశపడుతున్న వేణు, ప్రాజెక్ట్ రద్దయితే తదుపరి ఏ హీరోతో పనిచేయాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై ఏడాది గడిచిపోయింది. ఒకవేళ వేణు ఎవరితోనైనా సినిమా చేస్తే, షూటింగ్, విడుదల కోసం మరొక ఏడాది పడే అవకాశం ఉంది. ఇప్పటికే మీడియం రేంజ్ హీరోలు రెండేళ్ల దాకా ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో, వేణు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఏ హీరోని ఎంచుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.
Follow
Post a Comment