అల్లు అర్జున్ - అట్లీ.. సెట్టవ్వకపోవడానికి అసలు రీజన్ ఇదే..


అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా సినిమా క్యాన్సిల్ కావడంపై అనేక ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. ముఖ్యంగా రెమ్యునరేషన్ సమస్య కారణమని అంతా భావించారు. కానీ, దీనికి మరో కారణం ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప 2 రూల్ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇటువంటి సమయంలో ఇలాంటి రిస్క్ చేకూడదని అనుకున్నాడట. అట్లీ ప్లాన్ ప్రకారం కథలో ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యం ఉండగా, అల్లు అర్జున్ మాత్రం దీనికి అంగీకరించలేదని సమాచారం. 


మరో స్టార్ హీరోతో కలిసి పనిచేయడం రిస్క్ అని భావించాడు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో కొంత విఫలమైంది. ఇది కూడా బన్నీ నో చెప్పడానికి కారణం. అట్లీ ప్రణాళికలో బాలీవుడ్ స్టార్‌ని భాగం చేయడం ద్వారా మార్కెట్ స్కేల్ పెంచాలని ఉన్నా, అల్లు అర్జున్ మాత్రం మల్టీస్టారర్ సినిమాలకు ఈ సమయంలో సిద్ధంగా లేడని తెలుస్తోంది.

ఇది అట్లీ సల్మాన్ ఖాన్‌తో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి దారితీసింది. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో అట్లీ అదే ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్టు చెన్నై వర్గాల సమాచారం. దక్షిణాదిలో మరో పెద్ద హీరోని సెట్ చేయాలనుకుంటున్నాడు. జవాన్ లాంటి భారీ హిట్ ఇచ్చినప్పటికీ, ప్రతిసారి అదే రీతిలో విజయాన్ని ఆశించడం కష్టమనిపిస్తోంది. మొత్తానికి, అల్లు అర్జున్ తన కెరీర్‌లో వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కొన్ని అవకాశాలు వదులుకోవడం మంచిదని భావించి, ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేసినట్టు గీతా ఆర్ట్స్ వర్గాల నుండి టాక్ వస్తోంది.

Post a Comment

Previous Post Next Post