పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పదేళ్ళ కష్టం తరువాత ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్‌ని 'తుఫాన్' అని అభివర్ణించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కూటమి విజయానికి పవన్ పాత్ర కీలకమని ఒప్పుకున్నారు. వైసీపీ నాయకులు కూడా తమ ఓటమికి పవన్ కళ్యాణ్ కారణమని విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే, మెగాస్టార్ ఇంట్లో పవన్ విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. మెగాస్టార్ నుంచి వైష్ణవ్ తేజ్ వరకు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొని పవన్‌ను అభినందించారు.
అయితే, ఈ వేడుకలో అల్లు ఫ్యామిలీ సభ్యులు పాల్గొనకపోవడం చర్చకు దారితీసింది. అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా కార్యక్రమంలో కనిపించలేదు. ఇక ఈ టైమ్ లో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేయడం మరింత చర్చకు దారితీసింది. అల్లు అర్జున్ తన వైసీపీ మిత్రుడు శిల్పా రవికిశోర్ చంద్ర రెడ్డికి మద్దతుగా నంద్యాలకు వెళ్లడం జనసైనికులను అసహనానికి గురిచేసింది.
అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని తెలిపినా కూడా పవన్ ఫ్యాన్స్ చల్లారాలేదు, సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్‌తో దూరం పెట్టినట్లు కనిపించడం కొత్త అనుమానాలకు దారితీసింది. అల్లు అర్జున్ ఈ చర్చలకు ముగింపు కార్డు చాలా ఈజీగా వేయగలిగినా, ఇప్పటివరకు అలాంటి చర్య తీసుకోకపోవడం అభిమానుల్లో కొత్త సందేహాలకు దారితీస్తోంది. ఒక పండుగ సమయంలో, మెగా ఫ్యామిలీని కలిసే బన్నీ, జనసేన విజయోత్సవంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.
జనసేన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా వైసీపీని ఏమాత్రం ఇష్ట పడని తెలుగు దేశం ఫ్యాన్స్ లో కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికైనా మించి పోయింది లేదు. బన్నీ సైలెంట్ గా వెళ్లి పవన్ ను కలిసి కంగ్రాట్స్ చెబితే అన్ని సర్ఫుకుంటాయి. లేదంటే వివాదం పుష్ప 2కి పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. జనసేన, టీడీపీ శ్రేణులు పుష్ప 2పై అగ్రహంతోనే ఉంటే బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ కు ఎంతో కొంత డ్యామేజ్ పడుతుంది. మరి ఈ విషయంలో బన్నీ ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Follow
Post a Comment