ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన సినిమాలలో ఒకటైన 'కల్కి 2898 ఏడి' విడుదలకు ఇంకా 10 రోజుల టైం మాత్రమే ఉంది. ప్రేక్షకులు, బయ్యర్లు ఈ సినిమాపై పెట్టుకున్న ఆశలు మామూలుగా లేవు. జనవరిలో వచ్చిన 'హనుమాన్' తర్వాత, బాక్సాఫీస్ కి నిజమైన బూస్ట్ ఇవ్వగల సినిమాగా 'కల్కి 2898 ఏడి' అని ఎదురుచూస్తున్నారు. వైజయంతి మూవీస్ ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ పనుల్లో బిజీగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు, సెన్సార్ కార్యక్రమాలు, రీ రికార్డింగ్ వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇంత హైప్ ఉన్నా, 'కల్కి 2898 ఏడి'కి అదనంగా ప్రమోషన్ అవసరం లేకపోయినా, ఓపెనింగ్స్ మాత్రం భారీగా ఉండబోతున్నాయి. టాక్ పాజిటివ్ గా వస్తే, 'ఆర్ఆర్ఆర్', 'కెజిఎఫ్' కంటే ఎక్కువగా భారీ వసూళ్లను అందుకునే అవకాశం ఉంది. 3డి వెర్షన్ కూడా ఉంది కాబట్టి, ఎక్కువ శాతం థియేటర్లలో ఇదే ప్రదర్శించనున్నారు. 'ఆదిపురుష్' సినిమాకి ఈ స్ట్రాటజీ బాగా కలిసి వచ్చింది, అలానే 'కల్కి 2898 ఏడి' కూడా విజువల్ ట్రీట్ గా ఉండబోతోంది. నాగ అశ్విన్ ఆధునిక కల్కి కథను చెప్పే విధానం, ఇండియన్ స్క్రీన్ పై మొదటిసారి చూడబోతున్నాము.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఎగ్జిబిటర్లు మాత్రం 22 నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించాలని కోరుతున్నారు. ఇది జరగాలంటే టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన అనుమతులు ఈ వారంలోనే తీసుకోవాలి. ఈ చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాల నటన ప్రధాన ఆకర్షణ. అలాగే సంతోష్ నారాయణన్ అందించిన నేపధ్య సంగీతం కూడా కీలకంగా నిలుస్తోంది.
Follow
Post a Comment