రామోజీరావు పార్థివదేహం ముందు రాజమౌళి ఎందుకంత ఏడ్చారంటే..


మీడియా దిగ్గజం రామోజీరావు గారు కన్నుమూయడంతో సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు కూడా వెళుతున్నారు  అయితే ఈ క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఒక ఎమోషనల్ వీడియో వైరల్ గా మారింది. రామోజీరావు గారి పార్థివ దేహాన్ని చూడగానే రాజమౌళి ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. రాజమౌళిని ఈ తరహాలో గతంలో ఎప్పుడూ చూడలేదు. తన తల్లి చనిపోయినప్పుడు రాజమౌళి చాలా ఏడ్చారు. 


మళ్ళీ ఆ తర్వాత ఈ స్థాయిలో ఆయన బాధను తట్టుకోలేని వ్యక్తిగా కనిపించారు. అయితే ఇంతలా రామోజీరావు గారిపై ఆయనకు అభిమానం ఉండడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. రాజమౌళి ఫ్యామిలీ ఒకప్పుడు ఎంతగా ఆర్ధిక కష్టాలను ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలాసార్లు రాజమౌళి కీరవాణి వారి జీవితం గురించి చెప్పారు. ఇక కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా క్లిక్ కావడం వల్లే అప్పుడు కష్టాల నుంచి బయటపడ్డారు. కీరవాణి అన్నయ్య ఆదాయం ద్వారానే మా ఉమ్మడి కుటుంబం ఆనాడు హ్యాపీగా ఉందని రాజమౌళి గత ఇంటర్వ్యూలలో చెప్పాడు. అందుకే రాజమౌళి తాను ఎంత ఎత్తుగా ఎదిగినా కీరవాణిని అసలు విడిచి పెట్టడం లేదు.

ఇక అలాంటి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా నిలదొక్కుకోవడం వెనుక రామోజీ రావు గారి పాత్ర ఎంతో ఉంది. కష్టాల్లో చేసినటువంటి సహాయాన్ని రాజమౌళి ఫ్యామిలీ ఇప్పటికి మరువలేదు. కీరవాణి, చక్రవర్తి గారి దగ్గర సహాయకుడిగా ఉన్నప్పటి నుంచి అతనికి రామోజీరావు బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక మొదట కీరవాణి కల్కి అనే సినిమాకు మ్యూజిక్ అంధించగా అసలు ఆ సినిమా రిలీజ్ కాలేదు. మ్యూజిక్ కూడా పెద్దగా హైలెట్ కాలేదు. ఇక ఆ క్రమంలో రామోజీరావు పిలిచి మనసు మమత అనే సినిమాకు ఛాన్స్ ఇచ్చారు.

ఆ సినిమాతోనే కీరవాణి కెరీర్ మొదలైంది. అనంతరం పీపుల్స్ ఎన్ కౌంటర్, అశ్విని లాంటి మంచి సినిమాలకు కీరవాణికి ఛాన్స్ ఇవ్వడంతో కెరీర్ మలుపు తిరిగింది. ఆ తరువాత కీరవాణి ఆర్థికంగా ఇంకా బలంగా మారడంతో కుటుంబ పరిస్థితి మారిపోయింది. కష్టాల్లో ఉన్న సహాయాన్ని కీరవాణి కుటుంబంలో ఏ ఒక్కరు మర్చిపోలేదు. ఇక రాజమౌళి దర్శకుడిగా మొదటి అడుగు పడటానికి రామోజీరావు గారి సహాయం కూడా కొంత ఉంది. అతను మొదట శాంతినివాసం అనే సీరియల్ కు దర్శకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ సీరియల్ వెనుక రాఘవేంద్రరావు ఉన్నప్పటికీ ఈటీవీ అధినేత రామోజీరావు గారు చేసిన సహాయం కూడా చాలానే ఉంది. ఇక జక్కన్న, కీరవాణి ఆస్కార్ లెవెల్ కు వెళ్లినా రామోజీరావు సహాయాన్ని అభిమానాన్ని మరువలేదు. అందుకే ఆయన పార్థివదేహం ముందు రాజమౌళి ఒక పెద్ద దిక్కుని కోల్పోయిన చిన్న పిల్లడిలా ఏడ్చేశారు.

Post a Comment

Previous Post Next Post