పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజి' విడుదల వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 27 తేదీ రావడం కష్టమైపోయింది. దీంతో నిర్మాత నాగవంశీ తన మరో సినిమా 'లక్కీ భాస్కర్'ని అదే డేట్ కి ఫిక్స్ చేశారు. మరోవైపు OG వాయిదా పడితే అదే టైమ్ కు 'దేవర' టీమ్ వారి సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన ఉంది.
'ఓజి' టీమ్, పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల నిదానమే ప్రధానం అనే సూత్రం పాటించాలని నిర్ణయించారు. ఏపీలో జనసేన గెలిస్తే పవన్ రాజకీయ బాధ్యతల్లో ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో షూటింగ్ పనుల్లో తొందరపాటు అవసరం లేదు. పవన్ గెలిస్తే సినిమాకు మరింత హైప్ పెరుగుతుంది. కాబట్టి తొందరపడకుండా పర్ఫెక్ట్ డేట్ సెట్ చేసుకుంటే బాక్సాఫీస్ వద్ద జాక్ పాట్ కొట్టినట్లే. ఇక 'ఓజి' జనవరి వరకు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయానికి దర్శకుడు సుజిత్, నిర్మాత దానయ్యలు కూడా అంగీకరించారని తెలుస్తోంది.
Follow
Post a Comment