మహేశ్ బాబు, రాజమౌళి.. ఆ స్టార్ ఉన్నాడా?


సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ SSMB29 గురించి ఇటీవల కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ విరెన్ స్వామిని నియమించారనే వార్తలను నిర్మాతలు కొట్టి పారేశారు. RRR తర్వాత రాజమౌళి తీసే సినిమా కాబట్టి, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ ప్రాజెక్ట్ లో కీలక పాత్ర పోషించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.


రాజమౌళి, పృథ్విరాజ్ మధ్య చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహేశ్ బాబు ప్రస్తుతం కొన్నిక్లాసులు అటెండ్ చేస్తూ, తన పాత్రకు సంబంధించిన కొత్త లుక్ కోసం కృషి చేస్తున్నారు. ఈ కొత్త లుక్ ను రహస్యంగా ఉంచడానికి మహేశ్ బాబు తన పబ్లిక్ అపియరెన్సులను తగ్గించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుంది. కేఎల్ నారాయణ ఈ బిగ్-బడ్జెట్ ఎంటర్టైనర్ ను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post