వెంకీ, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా వంటి కొన్ని సంచలన విజయాలతో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉన్న శ్రీనువైట్ల ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నారు. ప్రస్తుతం అగ్ర నటులు శ్రీను వైట్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపడంలేదు. దీంతో టైర్ 2 రేంజ్ లో ఉన్న హీరోలతో సినిమాలు చేయాల్సి వస్తోంది. గోపీచంద్ తో విశ్వం సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఈ ఏడాది జూలైలో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఇక మరో వైపు శ్రీను వైట్ల ఎనర్జిటిక్ నటుడు రామ్‌ని కలుసుకున్నట్లు తెలుస్తోంది. రెడీ తరువాత మళ్ళీ ఈ కలయికలో సినిమా రాలేదు. ఇక ఇప్పుడు మరో స్టోరీ పాయింట్ తో అతన్ని మెప్పించినట్లు తెలుస్తోంది. పూర్తి స్క్రిప్ట్ చెప్పమని శ్రీను వైట్లని అడిగాడని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించడానికి చర్చలు జరుపుతున్నారు. విశ్వం సినిమా హిట్ అయితే శ్రీను వైట్లకు రామ్ తో మంచి అవకాశం వస్తుంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment