పుష్ప 2.. ఇలా అయితే 1000 కోట్లు కష్టమే..


పుష్ప 2 సినిమాతో వెయ్యి కోట్ల మార్కెట్ అందుకోవాలని అల్లు అర్జున్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సుకుమార్ - మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా రూపొందిస్తున్న ఈ సినిమాకు మంచి బజ్ అయితే ఉంది. ఆగస్టు 15న విడుదల విడుదల అవుతున్న ఈ సినిమాకు  వరుస అప్డేట్స్ ద్వారా మరింత హైప్ క్రియేట్ చేయాలి అని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అయితే రీసెంట్ గా విడుదలైన పుష్ప రాజ్ సాంగ్ మాత్రం అనుకున్నంత స్థాయిలో అన్ని భాషల్లో క్లిక్ కాలేదు.


హిందీలో 24 గంటల్లో 24 మిలియన్స్ వ్యూవ్స్ క్రాస్ చేసిన ఆ పాట తెలుగులో 21 మిలియన్ మార్క్ ను టచ్ చేసింది. అయితే బన్నీకి మంచి డిమాండ్ ఉన్న మలయాళం, కన్నడ భాషల్లో 2 మిలియన్స్ క్రాస్ చేసేందుకు చాలా కష్టపడింది. ముఖ్యంగా సౌత్ లో మంచి మార్కెట్ అయినటువంటి తమిళ్ లో 1 మిలియన్ వ్యూవ్స్ ను టచ్ చేయడం షాకింగ్ అనే చెప్పాలి. RRR, బాహుబలి లాంటి సినిమాలు తమిళ బాక్సాఫీస్ వద్ద 80 కోట్లు - 100 కోట్ల మార్క్ ను టచ్ చేశాయి. అలాంటిది పుష్ప సాంగ్స్ అక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేయకుంటే 1000 కోట్ల బాక్సాఫీస్ కల.. కలగానే మిగిలిపోతుంది. కాబట్టి వచ్చే అప్డేట్స్ మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది.

Post a Comment

Previous Post Next Post