పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విధానం ఇప్పుడు అతని భవిష్యత్తుకు పెద్ద ఛాలెంజ్ అయితే విసిరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఆయన గట్టి సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇస్మార్ట్ శంకర్ తోనే బౌన్స్ బ్యాక్ అయిన పూరి ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఆ కథకు సీక్వెల్ అందిస్తూ సెట్ అవ్వాలని చూస్తున్నాడు. హీరో రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన సక్సెస్ అయితే పడలేదు.
కాబట్టి ఇద్దరికీ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా అయితే ఈ సినిమా షూటింగ్ కి కాస్త బ్రేకులు పడ్డాయి. బడ్జెట్ విషయంలో కాస్త హెచ్చుతగ్గులు కావడం వల్లనే సినిమా షూటింగ్ వాయిదా పడినట్లుగా ఒక టాక్ అయితే వినిపించింది. అది ఎంతవరకు నిజమో కానీ మేకర్స్ అయితే 4 నెలలు గ్యాప్ అయితే ఇచ్చారు. ఇక మొత్తానికి రీసెంట్ గా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టడానికి పూరి టీమ్ సిద్ధమయ్యింది.
ముంబైలోనే మొదలయ్యే ఆ షెడ్యూల్లో టాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖు నటీనటులు పాల్గొనబోపోతున్నట్లు సమాచారం. ఇక ఇంతలా స్ట్రగుల్ అవుతున్న ఈ సినిమా మంచి టాక్ అందుకుంటేనే కలెక్షన్లు వస్తాయి. జూన్ లో రిలీజ్ అన్నారు కానీ సరైన బజ్ అయితే లేదు. ఇంకా నెల రోజుల టైమ్ లోనే సినిమా ప్రమోషన్స్ డోస్ పెంచలి అంటే అంత సులువు కాదు. కాబట్టి మరొక డేట్ సెట్ చేసుకొని ప్రమోషన్స్ కోసం మరో ప్లాన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది.
Follow
Post a Comment