సలార్ 2.. ఈసారి ఆ విషయంలో డోస్ పెంచి..

 


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సీక్వెల్ శౌర్యంగ పర్వంపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. సలార్ పార్ట్ 1లో వదిలేసిన చాలా ప్రశ్నలకి సీక్వెల్ గా ప్రశాంత్ నీల్ సమాధానం చెప్పబోతున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఖాన్సార్ సిటీ బ్యాక్ డ్రాప్ లోనే పార్ట్ 2 కథ మొత్తం తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ షూటింగ్ కి సంబందించిన ప్లానింగ్ చేసుకుంటున్నారు.


సలార్ 1 తో సాధించలేని వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని శౌర్యంగ పర్వంతో అందుకోవాలనే కసితో ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఇక ప్రభాస్ కూడా ఈ మూవీకి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఇంకో ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. సలార్ పార్ట్ 1 లో ప్రభాస్ దేవ క్యారెక్టర్ కి పెద్దగా డైలాగ్స్ లేవు. సినిమా మొత్తం లో కేవలం ప్రభాస్ క్యారెక్టర్ డైలాగ్స్ నిడివి 2.30 నిముషాలు మాత్రమే ఉండటం విశేషం. అయితే ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ బాహుబలి 2, ఛత్రపతి తరహాలో భారీ డైలాగ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
 

సినిమా మొత్తం లేకపోయిన ఒకటి, రెండు డైలాగ్స్ అయిన అలాంటివి ఉండాలని కోరుకుంటున్నారు. కేజీఎఫ్ సిరీస్ తరహాలో జనాలకి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ కూడా సలార్ లో లేవు. ప్రశాంత్ నీల్ నుంచి ఫ్యాన్స్ అలాంటి కనెక్టివిటీ డైలాగ్స్ ఆశిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సలార్ పార్ట్ 2 లో ప్రశాంత్ నీల్ భారీ డైలాగ్స్ ని ప్రభాస్ క్యారెక్టర్ కోసం రాస్తున్నారట. ఇంటర్వెల్ వచ్చే ఒక డైలాగ్ అయిత సినిమాకే హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post