ప్రభాస్ ప్లానింగ్.. మారుతికి ఇది తప్పని ఎదురుచూపు

 


మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజాసాబ్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఏడాదికి పైగా సినిమా నిర్మాణంలో ఉంది కానీ చాలా తక్కువ భాగం మాత్రమే షూటింగ్ పూర్తయింది.  దీనికి కారణం ప్రభాస్ పెద్ద లైనప్. ప్రభాస్ తన యూరప్ వెకేషన్ నుండి తిరిగి వచ్చినప్పుడు బల్క్ డేట్స్ కేటాయిస్తానని హామీ ఇచ్చాడు.  ఏప్రిల్, మే నెలల్లో రాజా సాబ్ కోసం ప్రభాస్ డేట్స్ కేటాయించాడు. కానీ ఏప్రిల్‌లో రాజా సాబ్ కోసం ప్రభాస్ ఒక వారం లోపే షూట్ చేసాడు.


ఇక ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ మరియు షూటింగ్ షెడ్యూల్‌లతో సిద్ధంగా ఉండటంతో సలార్ 2పై ఫోకస్ పడింది.  చాలా యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయాల్సి ఉన్నందున ప్రభాస్ సలార్ 2 కోసం బల్క్ డేట్స్ కేటాయించాల్సి వచ్చింది. ఇక రాజా సాబ్ కు ఇవ్వాల్సిన డేట్స్ సలార్ 2కి షిఫ్ట్ అయ్యాయి. కానీ గ్యాప్ దొరికినప్పుడల్లా రాజా సాబ్ షూటింగ్ కూడా చేస్తూ ఉండాలి. సాధారణంగా మారుతి సినిమాలను త్వరగా పూర్తి చేస్తాడు. కానీ రాజాసాబ్ కోసం అతను ఏడాదిన్నరగా వెయిటింగ్ మోడ్‌లో ఉన్నాడు. ప్రభాస్ కోసం తప్పదని అతను మరో ప్రాజెక్టు జోలికి కూడా వెళ్లడం లేదు. ఇక ప్లాన్ ప్రకారం రాజా సాబ్ 2025 సంక్రాంతికి విడుదల చేయాలి. అయితే సలార్ 2 ఈ సంవత్సరం క్రిస్మస్ విడుదల కోసం సిద్ధమవుతోంది. దీంతో షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండడంతో
రాజా సాబ్ 2025 వేసవికి షిఫ్ట్ కాబోతున్నట్లు టాక్.

Post a Comment

Previous Post Next Post