పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏడాది చాలా ప్రత్యేకంగా నిలవబోతోంది. ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన ఫ్యాన్స్ మాత్రం సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెండు క్రేజీ ప్రాజెక్టులు ఈ ఏడాదిలోనే విడుదల కాబోతూ ఉండడం విశేషం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతున్నప్పటికీ ఇంకా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. కాబట్టి ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అతను తప్పనిసరిగా సక్సెస్ అందుకోవాలి.
పోటా పోటీగా ఎన్నికల ప్రచారంలో పవన్ జోరుగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి అసెంబ్లీలో పవన్ అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగానే అనిపిస్తోంది. ఇక మరొకవైపు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న.. OG సినిమా సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది. మరో మూడు నెలలు గడవక ముందే హరిహర వీరమల్లు కూడా గ్రాండ్ గా విడుదల అయ్యే అవకాశం ఉంది. రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే. కాబట్టి ఎలక్షన్స్ లో విజయాన్ని అందుకుని, ఈ రెండు సినిమాలతో కూడా సక్సెస్ కొడితే మాత్రం ఆయన రేంజ్ మరో స్థాయికి చేరినట్లే. అందికే 2024 చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. మరి పవన్ కళ్యాణ్ లక్కు ఈ ఏడాది ఎలా ఉంటుందో చూడాలి.
Follow
Post a Comment