యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకురాలేదు. ఏడాది టైం తీసుకొని కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధం అవుతోంది. దేవర మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా హిందీలో వార్ 2 మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. స్పై థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడంట. ఈ మూవీలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం సిద్ధం అవుతోంది. దేవర, వార్ 2 సినిమా షూటింగ్ లు తారక్ బ్యాక్ టూ బ్యాక్ చేస్తున్నారు.
ఈ రెండు చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ 2 మూవీ పూర్తి చేయడంపై కంప్లీట్ గా ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో తారాక్ తో చేయాల్సిన మూవీ వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ నెలలో 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. ఆ రోజు దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసే ప్లానింగ్ లో కొరటాల శివ ఉన్నారంట. అయితే ఇన్ని రోజులు పోస్టర్స్ తో సరిపెట్టారు. గ్లింప్స్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తోన్న నేపథ్యంలో అతని సాంగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అలాగే వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని బర్త్ డే రోజు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంట. దాంతో పాటుగా ప్రశాంత్ నీల్ సినిమాకి సంబందించిన ఎనౌన్స్ మెంట్ ఆ రోజు వస్తుందని భావిస్తున్నారు.
Follow
Post a Comment