హరిహర వీరమల్లు.. డైరెక్టర్ పేరు ఎందుకు లేదంటే?

 


పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా హఠాత్తుగా ఆగిపోవడంతో దర్శకుడు క్రిష్ వెంటనే అనుష్కతో మరొక కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే నిర్మాత రత్నం మాత్రం తప్పకుండా సినిమా ఉంటుంది అని ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ ద్వారా హింట్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమా సంబంధించిన మరొక అప్డేట్ బుధవారం రోజు ఇవ్వబోతున్నట్లు చెప్పిన మేకర్స్ పోస్టర్లలో మాత్రం క్రిష్ పేరు ఎక్కడ హైలెట్ చేయలేదు.

సోషల్ మీడియాలో మాత్రం క్రిష్ ను ట్యాగ్ చేస్తున్నారు. ఇందుకు కారణం ఇంకా డైరెక్టర్ క్రిష్ తో చర్చలు ఫినిష్ కాలేదు. స్క్రిప్ట్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని మార్పులు చేయాలి అని ముందుగానే దర్శకుడికి చెప్పాడు. ఆ విషయంలో కూడా దర్శకుడు సరైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ క్రిష్ ఒప్పుకుంటే టీజర్ తర్వాత ఇచ్చే అప్డేట్స్ లో అతని పేరు ఉంటుంది. లేదంటే మరొక దర్శకుడుతో ప్రాజెక్టును ఫినిష్ చేసేలా ఏఏం. రత్నం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ విషయంపై మొత్తంగా క్లారిటీ రావాలి అంటే ముందుగా పవన్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంటుంది. ఇక అతను ఈ ప్రాజెక్టుపై ఎలక్షన్స్ తర్వాతే ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ సస్పెన్స్ తప్పదు.

Post a Comment

Previous Post Next Post