అల్లు అర్జున్ ఇటీవల నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి సపోర్ట్ చేయడం జనసేన లో చాలామందికి నచ్చలేదు. జనసేనకు మద్దతు అందిస్తున్నాను అని చెప్పిన కొద్దిసేపటికే బన్నీ అలా వైసిపి అభ్యర్థి దగ్గరికి వెళ్లి అతనికి సపోర్ట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే రీసెంట్ గా నాగబాబు చేసిన ఒక ట్వీట్ కూడా అల్లు అర్జున్ కు కౌంటర్ గానే అనే విధంగా కామెంట్స్ వచ్చాయి.
మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే... అని నాగబాబు ట్విట్టర్ లో స్పందించిన విధానం తో అందరూ కూడా అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ ఆ కామెంట్ చేశారని భావించారు. నిజానికి ఈ విషయంపై నాగబాబు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో తప్పుడు సంకేతాలు అందాయి.
అయితే బన్నీ పవన్ కళ్యాణ్ కు ఎప్పటికీ కూడా వ్యతిరేకంగా అయితే ఉండలేదు. ఒకప్పుడు చెప్పను బ్రదర్ అనే కామెంట్ కూడా ఫాన్స్ చేసిన అత్యుత్సాహం వల్లనే ఆ విధంగా రియాక్ట్ కావాల్సి వచ్చింది. పవన్ గత ఎన్నికల్లో ఉన్నప్పుడు అందరికంటే మొదటగా వెళ్లి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా సపోర్ట్ చేశాడు. అంతేకాకుండా సినిమా ఈవెంట్స్ లలో కూడా పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని గురించి తెలియజేశాడు.
ఇక జనసేన కోసం కోటికి పైనే విరాళం అందించి తన మద్దతు ఏ స్థాయిలో ఉందో తెలియజేసాడు. JSP పేరుపై వాటర్ ప్లాంట్స్. కొన్నిసార్లు ఫ్యాన్స్ కోసం కూడా డోనేషన్స్ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు సడన్ గా తన స్నేహితుడి కోసం ఒక అడుగు ముందుకేసి మద్దతుగా నిలబడితే శత్రువుగా చూడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది అభిమానులు ఈ విషయంలో అనవసరంగా బన్నీని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనే విధంగా మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి నాగబాబు వేసిన ట్వీట్ పై ఆయన మళ్ళీ ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.
Follow
Post a Comment