ఇటీవల క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో దర్శకదీరుడు రాజమౌళి ఒక కమర్షియల్ యాడ్ లో నటించిన విషయం తెలిసిందే. రాజమౌళికి నటించడం అయితే కొత్తేమి కాదు. గతంలో కొన్ని చిన్న సినిమాలలో కూడా అతను గెస్ట్ పాత్రలలో కనిపించాడు. ఇక ఇదివరకే ఒప్పో కంపెనీకి సంబంధించిన ఒక యాడ్లో కూడా అతను కనిపించాడు. ఇక దర్శకుడిగా రాజమౌళి ప్రతి సినిమాకు కూడా సక్సెస్ లో ప్రాఫిట్ అందుకునే విధంగా డీల్స్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నాడు.
ఆయన డైరెక్ట్ చేసే సినిమాలకు నిర్మాత ఎవరైనా కూడా మార్కెట్ విషయంలో అయితే ఎక్కువ భాగం నిర్ణయాలు రాజమౌళి చేతిలోనే ఉంటాయి. ఇక RRR సినిమాతో ఆయనకు వచ్చిన ప్రాఫిట్ దాదాపు 100 కోట్లకు పైనే అని ఆ మధ్య టాక్ అయితే వినిపించింది. ఇక ఒక కమర్షియల్ యాడ్ చేస్తున్నందుకు రాజమౌళి దాదాపు 5 నుంచి 7 కోట్ల మధ్యలో పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. కమర్షియల్ యాడ్స్ లో చాలావరకు ఆఫర్స్ వస్తున్నప్పటికీ రాజమౌళి మాత్రం మంచి డిమాండ్ ఉండే బ్రాండ్స్ లలో మాత్రమే యాడ్స్ చేసేందుకు ఒప్పుకుంటున్నాడు. మరి రాబోయే రోజుల్లో అతనికి ఇంకెలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి. ఇక మహేష్ బాబు ప్రాజెక్ట్ త్వరలోనే మొదలుకాబోతున్న విషయం తెలిసిందే.
Follow
Post a Comment