కథ:
ఒక మధ్యతరగతి ఫ్యామిలీ మాన్ గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) సింధు (మృణాల్ ఠాకూర్) ను ఒక పెంట్ హౌస్ కనెక్షన్ తో కలుసుకుంటారు. ఆమెతో ప్రేమలో పడిన అనంతరం ముందుగానే ఆమె ఒక ప్రాజెక్ట్ వర్క్ కోసం తన దగ్గరికి వచ్చిందని తెలుసుకుంటడు అనంతరం ఆమెను దూరంగా ఉంచుతాడు. ఇక గోవర్ధన్ ఒక ఎలైట్ కంపెనీలో చేరిన తరువాత మళ్ళీ హీరోయిన్ ఎదురవుతుంది. అనంతరం ఫ్యామిలీ మాన్ ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడు? గోవర్ధన్ ద్వేషాన్ని సింధు ఎలా ఎదుర్కొంటుంది? ఇక తన ఫ్యామిలీకి లవ్ కి కనెక్షన్లు ఏంటి? అనే పాయింట్స్ తో సినిమా కథ కొనసాగుతూ ఉంటుంది.
విశ్లేషణ:
ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ తోనే దర్శకుడు పరుశురామ్ ఒక పాజిటివ్ క్రియేట్ చేశాడు. అంతే కాకుండా దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ తో కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఏ విధంగా హడావిడి చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమాలో కంటెంట్ అదే తరహాలో కనెక్ట్ అయిందా లేదా అనే వివరాల్లోకి వెళితే.. దిల్ రాజు నుంచి ఒక ఫ్యామిలీ సినిమా వస్తోంది అనగానే తప్పకుండా మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఏ మాత్రం క్లిక్ అయినా కూడా కలెక్షన్స్ ఊహించని రేంజ్ లోనే ఉంటాయి.
ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా అదే తరహాలో మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అని కామెంట్స్ అయితే గట్టిగానే వచ్చాయి. దర్శకుడు పరుశురామ్ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథలను ఇదివరకే బాగా తెరపైకి తీసుకువచ్చాడు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో అతను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్న మెయిన్ ప్లాట్ అలాగే సన్నివేశాలు అన్నీ కూడా ఒక క్యాలిక్యులేషన్ తోనే ప్రజెంట్ చేయాలి అని అనుకున్నాడు.
హీరో క్యారెక్టర్ - ఆ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ - ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని బడ్జెట్ పద్మనాభం తరహాలో ఉండే హీరోకు హీరోయిన్ నచ్చడం - వారిద్దరి మధ్యలో వచ్చిన గొడవ అనంతరం మళ్లీ కథ యూఎస్ కు వెళ్లడం - మళ్లీ ఇంకో కామెడీ గొడవ - సరదా లవ్ ఏమోషన్.. ఇలా పక్క ప్రణాళికతో దర్శకుడు స్క్రీన్ ప్లే సెట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అతను సెట్ చేసుకున్న స్క్రీన్ ప్లే బాగానే ఉన్నప్పటికీ కథనంలో విషయం లేకపోవడంతో ఆడియన్స్ కు అసలు మెయిన్ క్యారెక్టర్స్ కు కనెక్ట్ అవ్వరేమో అనిపిస్తుంది. ల్యాగ్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి.
ఏ కథలో అయినా సరే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయితేనే మిగతా సన్నివేశాలకు బలం చేకూరుతుంది. గీత గోవిందం లో దర్శకుడు ఆ కెమిస్ట్రీని బాగా హైలెట్ చేశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి విజయ్ మృణాల్ ఇద్దరి మధ్యలో అదే మెయిన్ గా మిస్ అయింది. ఇక కొన్ని అతిగా చేసిన మిడిల్ క్లాస్ సన్నివేశాలు అసలు కనెక్ట్ కావు. ఇంటర్వెల్లో వచ్చే ఒక పాయింట్ కూడా సెకండ్ హాఫ్ పై పెద్దగా అంచనాలు పెంచవు.
ఫస్ట్ హాఫ్ లో బ్రదర్స్ మధ్య గొడవ మరీ సాగదీసినట్లుగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో యూఎస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సన్నివేశాలు కూడా అంత గొప్పగా ఏమీ ఉండవు. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. విజయ్ గోవర్ధన్ క్యారెక్టర్ నటిస్తున్నట్లు ఉంటుంది కానీ కథలో లీనమైనట్లుగా కనిపించదు. డైలాగ్ డెలివరీ విషయంలో కూడా విజయ్ కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఏదో రాగం తీసినట్లుగానే అతని డైలాగ్స్ ఉంటాయి. మృణాల్ రెగ్యులర్ హీరోయిన్ గానే కనిపించింది.
ఇక సినిమాలో జగపతిబాబు రవిబాబు లాంటి క్యారెక్టర్స్ పరవాలేదు అనిపిస్తాయి. టెక్నీషియన్స్ విషయానికి వస్తే కొంతవరకు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రెండు పాటలు తప్పితే గోపి సుందర్ వర్క్ అంతగా క్లిక్కవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మరీ వీక్ గా ఉంది. మిగతా నటీనటులు కూడా వారి పాత్రలకు తగ్గట్టుగా న్యాయం చేశారు. కానీ అసలైన ఎమోషన్ అనేది క్లిక్ అయితే అవ్వలేదు. మరి సమ్మర్ హాలిడేస్ లో ఈ సినిమా ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
ప్లస్ పాయింట్స్:
👉విజయ్, మృణల్
👉రెండు పాటలు
👉ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్:
👉రొటీన్ స్టోరీ
👉ఏమోషన్ మిస్సయ్యింది
👉బ్యాక్ గ్రౌండ్ స్కోర్
రేటింగ్: 2.5/5
Follow
Follow
Post a Comment