జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమా సినిమాను అక్టోబర్ 10వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే విధంగా ఎప్పటికప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక అవి ఫాన్స్ కు బాగానే నచ్చుతున్నప్పటికీ మిగతా భాషల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో హైప్ క్రియేట్ చేయడం లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
దేవర సినిమా దాదాపు 400 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆడియో రైట్స్ కోసం టి సీరీస్ 33 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ దాదాపు 150 కోట్ల వరకు డీల్ ఫైనల్ చేసినట్లుగా మరొక టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ దాదాపు 130 కోట్లకు పై పైగానే జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఓవర్సీస్ రైట్స్ అయితే 27 కోట్లకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. కర్ణాటక కేరళ ఇలా మిగతా రాష్ట్రాల నుంచి సినిమా దాదాపు 50 నుంచి 60 కోట్ల మధ్యలో బిజినెస్ చేసినట్లు సమాచారం. ఒకవేళ 400 కోట్లకు పైగా బిజినెస్ జరిగితే మంచిదే. కానీ సినిమాకు ప్రస్తుతం అయితే అంతగా బజ్ పెరగడం లేదు. ఆ మధ్య వచ్చిన టీజర్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఇక బారమంతా అనిరుధ్ పైనే ఉన్నట్లుగా తెలుస్తోంది అతను నెక్స్ట్ మ్యూజిక్ తోనే సినిమాను మరొక లెవెల్ కు తీసుకువెళితేనే సినిమాకు పాన్ ఇండియా మార్కెట్లో మంచి ఓపెనింగ్స్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
Follow
Post a Comment