బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కల్కి 2898 AD సినిమాలో అశ్వథ్థామ అనే పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అమితాబ్ బచ్చన్ కు 81లో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎనర్జిటిక్ కనిపిస్తున్నారు. తప్పకుండా ఈ పాత్ర అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది హైలెట్ అయింది. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో కూడా అశ్వద్ధామ క్యారెక్టర్ కు సంబంధించి చాలా రకాల వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే యువ అశ్వథ్థామ పాత్రలో సరికొత్తగా ఆకట్టుకోబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆయన ఏ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు ట్రెండ్ అవుతున్నాయి. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే వైజయంతి మూవీస్ అమితాబ్ బచ్చన్ కు దాదాపు 18 నుంచి 20 కోట్ల మధ్యలో పారితోషకం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన కాల్ షీట్స్ కూడా 40 రోజుల కంటే తక్కువగా తీసుకున్నట్లు సమాచారం. ఇక రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మే చివరలో లేదా జూన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Follow
Post a Comment