నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం బడ్జెట్ దాదాపు 90 కోట్లు వరకు ఖర్చు అయ్యిందని అని ఈమధ్య గట్టిగానే కథనాలు వెలువడుతున్నాయి. నిర్మాత దానయ్య ఇప్పటికే పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేలా బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ చేశారు అని టాక్ అయితే వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాకు 90 కోట్లు ఖర్చు చేశారు అనే విషయంలో అయితే నిజం లేదు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ గట్టిగానే ఉన్నాయని చెబుతున్నారు.
అయితే నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ ను నమ్మి ఆ రేంజ్ లో ఖర్చు చేస్తే సినిమా బిజినెస్ జరగదన్న విషయం నిర్మాతకు బాగా తెలుసు. ఇదివరకే వీరు చేసిన అంటే.. సుందరినికి నష్టాలు ఎక్కువే. ఇప్పటివరకు నాని ఏ సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద 90 కోట్ల రేంజ్ లో అయితే షేర్ కలెక్షన్స్ అందుకోలేదు. దసరా కూడా కొన్ని ఏరియాల్లో నష్టాల్ని కలిగించింది. హాయ్ నాన్న కూడా పరవాలేదు అనే విధంగా కలెక్షన్స్ అందుకుంది కానీ మరి హై రేంజ్ లో నెంబర్స్ అయితే నమోదు కాలేదు.
అలాంటప్పుడు నాని కోసం ఆ రేంజ్ లో నిర్మాత ఎందుకు ఖర్చు చేస్తాడు అనేది అసలు ప్రశ్న. మొత్తంగా దానయ్య అయితే సేఫ్ జోన్ లోనే సినిమా కోసం 60 కోట్ల కంటే తక్కువే ఖర్చు చేశాడని తెలుస్తోంది. ఇక థియేట్రికల్ అలాగే నాన్ థియేట్రికల్ హక్కులను కూడా ఆయన మంచి డీల్స్ కు క్లోజ్ చేసుకున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడమే కాకుండా టేబుల్ ప్రాఫిట్ కూడా దక్కింది. ఒకవేళ సరిపోదా శనివారం సినిమా సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటే మాత్రం ఆ తర్వాత సుజిత్ తో చేయబోయే సినిమా కోసం 90 కోట్ల రేంజ్ లో ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.
Follow
Post a Comment