గోపిచంద్.. ఈసారి హిట్టు కొట్టకపోతే..

 

 
 

విలన్ గా చాలా కష్టపడి ఆ తరువాత హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు గోపీచంద్. అయితే చాలా కాలంగా అతనికి సక్సెస్ అనేది రావడం లేదు. అప్పుడెప్పుడో 2014లో లౌక్యం అనే సినిమాతో కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక తరువాత వచ్చిన పది సినిమాలు రాగా.. గోపీచంద్ దేనితోనో సరైన సక్సెస్ అందుకోలేదు. మధ్యలో కొన్ని అటు ఇటుగా పరవాలేదు అనిపించాయి, కానీ అవి కూడా పూర్తిస్థాయిలో బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ను అందుకోలేకపోయాయి.


ఇక ఈసారి బీమా సినిమాతో రాబోతున్న గోపీచంద్ తప్పనిసరిగా సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. గత ఏడాది వచ్చిన రామబాణం సినిమా అయితే మరి దారుణంగా డిజాస్టర్ అయింది. ఆ సినిమా పై పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం లో సగం కూడా వెనక్కి రాలేదు. కాబట్టి ఈసారి బీమా సినిమా మినిమం సక్సెస్ అందుకుంటే సరిపోదు.. బాక్సాఫీస్ వద్ద డబుల్ ప్రాఫిట్ అందించే దిశగా కలెక్షన్స్ అందుకోవాలి. అలా అయితేనే గోపీచంద్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద బడ్జెట్ సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. భీమా సినిమాలో యాక్షన్ తో పాటు ఫాంటసీ ఎలిమెంట్ కూడా బలంగానే ఉండబోతోంది. దీంతో సాహసం లాంటి సెంటిమెంట్ అతనికి కలిసి వస్తుందేమో అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఆ సినిమాతో గోపి ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post