కథ:
అర్జున్ రుద్ర (వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో వింగ్ కమాండర్, ప్రాజెక్ట్ వజ్ర టెస్టులో తన స్నేహితుడు కబీర్ (నవదీప్)ని పోగొట్టుకుంటాడు. ప్రాజెక్ట్ నిలిచిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత, అతను మళ్లీ టెస్ట్ పైలట్‌గా చేరతాడు. ఇంతలో, శ్రీనగర్‌లో ఒక ఉగ్రదాడి జరుగుతుంది, ఇది పాకిస్తాన్ పని అని తెలుసుకున్న IAF ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఇక శత్రువులపై భారతదేశం తిరిగి ఎలా పోరాడుతుంది? దాడి సమయంలో ప్రాజెక్ట్ వజ్ర భారతదేశానికి ఎలా సహాయం చేస్తుంది? ఆహ్నా గిల్ (మానుషి చిల్లర్) కథకు ఎలా కనెక్ట్ అయ్యింది? ఇక యుద్ధంలో అర్జున్ ఎలాంటి అడుగులు వేస్తాడు అనేది సినిమాలో అసలు కథ.
విశ్లేషణ:
మెగా హీరో వరుణ్ తేజ్ తన ప్రతి సినిమా కథలో కూడా ఏదో ఒక గొప్పతనం ఉంటుంది అని మరోసారి ఈ సినిమా ద్వారా నిరూపించే ప్రయత్నం చేశాడు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో అతను చేసిన రుద్ర పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఒకవైపు తన పవర్ఫుల్ క్యారెక్టర్ ను హైలైట్ చేస్తూనే మరొకవైపు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యే విధంగా వరుణ్ తేజ్ నటించిన విధానం చాలా హైలైట్ అయింది. ఇక అతను డైలాగ్ డెలివరీ అలాగే వింగ్ కమాండర్ గా చూపించిన హావభావాలు కూడా అతని పాత్రను మరింత పవర్ ఫుల్ గా మార్చాయి అని చెప్పవచ్చు.
ఫస్ట్ ఆఫ్ లో క్యారెక్టర్స్ ను పరిచయం చేసిన విధానం ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ వాతావరణంలోని వివిధ రకాల అంశాలను హైలెట్ చేసిన దర్శకుడు అనంతరం శత్రువుల సంబంధించిన పాయింట్స్ కూడా మెల్లమెల్లగా రివీల్ చేస్తూ కథపై చాలా ఆసక్తిని కలిగించాడు. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా తను చెప్పాలనుకున్న పాయింట్ ను పర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో తీసుకున్న ప్లాట్ మాత్రం సెకండ్ హాఫ్ పై మరింత అంచనాలను పెంచే విధంగా ఉంది.
అయితే కొన్ని సన్నివేశాలు హీరో ఎలివేషన్స్ కోసం అలాగే ఆర్మీ మీటింగ్ కు సంబంధించిన సన్నివేశాలు అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. ఆ సమావేశాలు త్వరగా పూర్తయితే అసలు కథలోకి వెళ్ళవచ్చు అనే భావన కలుగుతుంది. అలాగే హీరోయిన్ ప్రేమ కథకు సంబంధించిన అంశాలపై దర్శకుడు మరికొంత జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అయితే అసలు కథ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ కాకుండానే ఆ సన్నివేశాలు కొనసాగుతూ ఉంటాయి.
ఇక సెకండ్ హాఫ్ లో ఉగ్రముకల దాడి అలాగే వారి ప్రణాళికలు తిప్పికొట్టే విధంగా సైన్యం సిద్ధం అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఆకాశంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. వరుణ్ తేజ్ తన టోటల్ పర్ఫామెన్స్ తో యాక్షన్ సన్నివేశాల్లో కూడా చాలా హైలెట్ అయ్యాడు. క్లైమాక్స్ లో తీసుకున్న ఎమోషనల్ పాయింట్స్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఒకవైపు దేశభక్తిని హైలెట్ చేస్తూనే మరొకవైపు కథకు అవసరమైన మేరకు యాక్షన్ డోస్ అయితే ఈ సినిమాలో ఇచ్చారు.
మొత్తానికి ఆర్మీకి సంబంధించిన అంశాలను కూడా ఎక్కడా తప్పుదోవ పట్టించకుండా పర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకువచ్చాడు దర్శకుడు. ఈ విషయంలో చాలా రీసెర్చ్ చేశాడు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక అధికారులు ఎలా ఉండాలి ఇక వారి ఆదేశాలు ఏ తరహాలో ఉంటాయి అనే ఫైల్స్ కూడా బాగా హైలైట్ అయ్యాయి. మొత్తానికి సినిమాలో లవ్ స్టోరీ తో పాటు దేశం ఎయిర్ ఫోర్స్ అంశాలు ఇక వీరోచిత పోరాటాలు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి. అక్కడక్కడ స్లోగా సాగే సీన్స్ ఉన్నప్పటికీ కూడా ఫైనల్ గా సినిమా పరవాలేదు అని అనిపిస్తూ ఉంటుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
ప్లస్ పాయింట్స్:
👉కథ
👉హీరో రుద్ర క్యారెక్టర్
👉సెకండ్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
👉మ్యూజిక్
👉ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
రేటింగ్: 2.75/5
Follow
Follow
Post a Comment