రాజమౌళి ఎలాంటి సినిమా చేసిన కూడా ఇటీవల కాలంలో అయితే రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా బిజినెస్ లో వాటా రూపంగా తన లాభాన్ని అందుకుంటూ ఉన్నాడు. దాదాపు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా ఇదే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇక మహేష్ బాబు కూడా అదే తరహాలో ముందుకు వెళ్లగా ఇప్పుడు రాజమౌళి సినిమా విషయంలో మాత్రం అలా చేయడం లేదు.
ఎందుకంటే రాజమౌళి నిర్మాతతో ఒక బేరం కుదుర్చుకొని ఆర్టిస్టులు అందరికీ కూడా రేంజ్ కు తగ్గ రెట్లు ఫిక్స్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు నెక్స్ట్ మహేష్ తో చెయ్ బోయే సినిమాకు కూడా ఇదే విధంగా డీల్ అయితే సెట్ అయింది. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కాబోతోంది అనేలా టాక్ వస్తోంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం రాజమౌళి కూడా రెమ్యునరేషన్ తీసుకుని వెనక్కి జరగాల్సిందే. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా వీలైనంతవరకు స్టార్స్ కు అలాగే దర్శకులకు అడిగినంత పారితోషకం ఇచ్చి బిజినెస్ డీల్స్ అన్నీ కూడా వారే చూసుకుంటారు. కాబట్టి ఒక విధంగా ఇది రాజమౌళికి ఇబ్బందే. అసలే సినిమా 1500 కోట్ల వ్యాపారం చేయవచ్చని టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.
Follow
Post a Comment