కథ:
తండ్రిని ఎంతగానో అభిమానించే కొడుకు రన్ విజయ్ సింగ్(రణబీర్) కొన్నాళ్ళకు తండ్రికి(అనిల్ కపూర్ ) దూరంగా విదేశాల్లో చదువుకోడానికి వెళ్తాడు. అయితే కొడుకు ఎంతగా ప్రేమిస్తున్న కూడా తండ్రి మాత్రం అతన్ని పెద్దగా పట్టించుకోడు. అయితే అంత హ్యాపీగా ఉన్న సమయంలో తండ్రికి ఊహించని విధంగా ఒక సమస్య ఎదురవుతుంది. ఆ భయంకరమైన సమస్య సృష్టించింది ఎవరు అలాగే విలన్ ను ఎలా అడ్డుకోవాలి అనే అంశంతో ఈ సినిమా మిగతా కథ కొనసాగుతూ ఉంటుంది. ఇక తండ్రి కోసం ఎంత దూరమైన వెళ్లే కొడుకుగా ఇందులో రణబీర్ కపూర్ నటించాడు.
విశ్లేషణ:
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు సంబంధించిన కథ గురించి ముందుగా ట్రైలర్ లోనే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు. ఒకే ఒక్క డైలాగ్ లో అతని ప్రేమ అలాగే అతని క్యారెక్టర్ ను హైలెట్ చేసిన విధానం అందరికీ ఎక్కువగా నచ్చేసింది. యానిమాల్ లో రణబీర్ కపూర్ అగ్రెసివ్ మూమెంట్స్ తోనే అతని క్యారెక్టర్ ఏ విధంగా యూ టర్న్ తీసుకుంటుంది అనే అంశాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. ప్రతి సన్నివేశంలో కూడా దర్శకుడు తన మార్క్ చూపించాడు. అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా కథ ఏమోషన్ కు అంతర్లీనంగా ఉండేలా తీసుకున్న జాగ్రత్తలు కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ క నిలిచాయి.
ఆఖరికి గ్రాండ్ ఫాదర్ పాత్ర కూడా ఈ సినిమాలో హైలెట్ చేసిన విధానం బాగా వర్క్ అవుట్ అయింది చిన్నతనం నుంచే తండ్రీ పై అతి భయాంకరంగా ప్రేమను పెంచుకున్న హీరో అతనిని లైఫ్ లో ఎంతగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనే అంశం సినిమాలో మేజర్ హైలెట్. ఎంతో ఇష్టమైన తండ్రికి ఆపద వస్తే శత్రువులను అతను ఎంత దారుణంగా దాడి చేశాడు అనే అంశాలు కూడా చాలా బలంగా ప్రెసెంట్ చేశాడు దర్శకుడు. ఇక బాబి డియోల్ పాత్ర విలన్ గా కనిపించిన విధానం చాలా బాగా హైలైట్ అయింది.
ఆ పాత్రను ఎంతో బలంగా చూపించడంతో మరోవైపు హీరో పాత్ర కూడా అంతే పవర్ఫుల్ గా హైలెట్ అయింది. ఇక్కడ దర్శకుడు హీరో విలన్ మధ్యలో క్రియేట్ చేసిన పాయింట్స్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అయితే హీరో హీరోయిన్ మధ్యలో వచ్చే సన్నివేశాలు మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేవు. గతంలో అర్జున్ రెడ్డి సినిమాలో రొమాంటిక్ లవ్ సీన్స్ తోనే బాగా ఆకట్టుకున్న దర్శకుడు సందీప్ ఈసారి రష్మిక తో మాత్రం ఆ మ్యాజిక్ క్రియేట్ చేయలేదు అనిపిస్తుంది.
ఫస్ట్ ఆఫ్ మొత్తంలో కూడా ఎక్కడ ఈ సినిమా పెద్దగా నిరాశపరచదు. హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ల్ అక్కడక్కడ కాస్త నెమ్మదిగా అనిపించే సన్నివేశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మూడు గంటలు ఉన్నప్పటికీ హీరో క్యారెక్టర్ తో అలాగే ఎమోషన్స్ తో యాక్షన్ సన్నివేశాలతో బాగా ఎంటర్టైన్ చేశాడు అని చెప్పవచ్చు. ఇక ఇందులో రణబీర్ కపూర్ కు సంబంధించిన మాస్ సన్నివేశాలు అలాగే అతని పర్ఫామెన్స్ కూడా కెరీర్ లోనే ఒక బెస్ట్ అని చెప్పవచ్చు.
ఇక అనిల్ కపూర్ కూడా హీరో క్యారెక్టర్ తో ఉన్న సన్నివేశాలలో పర్ఫెక్ట్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. బాబీ డియోల్ యాక్టింగ్ కూడా మరొక లెవెల్ లో ఉంది. రష్మిక క్యారెక్టర్ ను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేదే. ఇక ఈ సినిమాలో ప్రధాన ఆయుధంగా చెప్పుకోవాల్సింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్. పాటల్లో ఒక రెండు బాగున్నప్పటికీ మిగతావి అంతగా ఆకట్టుకోలేదు. కానీ హర్షవర్ధన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకు ప్రధాన ఆయుధంగా నిలిచింది. మొత్తానికి సందీప్ మరోసారి తన మార్కు టైమింగ్ యానిమాల్ ను అంచనాలకు తగ్గట్టుగా హైలెట్ చేశాడు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ తప్పితే సినిమా పెద్దగా బోర్ కొట్టే సీన్స్ ఏమి ఉండవు. ముఖ్యంగా క్లైమాక్స్ కూడా బాగా హైలైట్ అయింది.
ప్లస్ పాయింట్స్:
👉బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
👉హీరో క్యారెక్టర్
👉యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
👉సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
👉రొటీన్ కథ
రేటింగ్: 3/5
Post a Comment