టైగర్ నాగేశ్వరరావు.. RRR ఫార్ములానే..?


స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు ఉన్నవాడి నుంచి దోచుకుని లేనివాడికి దానం చేసేవాడు అని ఇంటర్వ్యూలలో పోలీసులు కూడా చెప్పారు. అందుకే అతను చనిపోయినప్పుడు వేలాదిమంది అతని అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతేకాకుండా అందరూ కలిసి అతనికి ప్రత్యేకంగా సమాధి కూడా పెద్దగా కట్టించారు. ఇప్పటికే స్టువర్టుపురం లో ఆ సమాధి కనిపిస్తూ ఉంటుంది.

అందుకే టైగర్ నాగేశ్వరరావు పేరు ఇప్పటికీ కూడా ఒక ట్రెండింగ్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు రవితేజ చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ఒరిజినల్ కథగా ఉండకపోవచ్చు అని విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. రాజమౌళి RRR సినిమాలో ఎలాగైతే కొమరం భీమ్ సీతారామరాజు పాత్రలను ఆధారంగా చేసుకుని ఫిక్షనల్ కథను తెరపైకి తీసుకువచ్చాడో ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు పాత్రను కూడా అలాగే దర్శకుడు వంశీ హైలెట్ చేయబోతున్నట్లుగా అనిపిస్తోంది.

ఎందుకంటే ట్రైలర్ లో సీఎం కనెక్షన్స్ అంటూ బాగానే హైలెట్ చేశారు. అంతేకాకుండా హీరోయిన్ ట్రాక్ యాక్షన్ డోస్ ఇలా అన్నీ కూడా ఫిక్షన్ అని అర్థమవుతుంది. కాబట్టి కమర్షియల్ యాంగిల్ లో టైగర్ నాగేశ్వరరావు పాత్రను దర్శకుడు వంశీ గట్టిగానే హైలెట్ చేయబోతున్నాడు. నిజానికి అయితే ఒక అమ్మాయి కారణంగా టైగర్ నాగేశ్వరరావుకు మరణం సంబవించింది.

ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు మాటు వేసి అతని కాలు మీద కాల్చారు. ఇక తర్వాత అతను కోన ఊపిరి తో ఉన్నప్పటికీ మళ్ళీ దూరంగా తీసుకువెళ్లి ఎన్కౌంటర్ చేసేసారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా అప్పటి పోలీసు అధికారి తెలియజేసారు. కాబట్టి ఈ విధంగా టైగర్ నాగేశ్వరరావు పాత్రను చూపిస్తే అంతగా బాగుండదేమో అని దర్శకుడు ఈ కమర్షియల్ ఫార్మాట్లో ఆ క్యారెక్టర్ ను మాత్రమే తీసుకొని ఆనాటి అంశాలను హైలైట్ చేస్తూ.. కమర్షియల్ పాయింట్స్ తో వెళ్లినట్లు అర్థమవుతుంది. మరి ఇది ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post