MAD మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:
మనోజ్ (రామ్ నితిన్) అశోక్ (నార్నే నితిన్) దామోదర్ (సంగీత శోభన్) కాలేజీలో చేరిన కొన్ని రోజులకే మంచి స్నేహితులుగా మారిపోతారు. ఇక ప్రత్యర్థి గ్యాంగ్ తో బాస్కెట్ బాల్ ఆటలో గెలవడంతో వారి బాండింగ్ మరింత బలపడుతుంది. అయితే ఇక వారి ప్రయత్నాల అల్లరి ప్రేమకు అమ్మాయిలు కూడా కనెక్ట్ అవుతారు. ఇక ముగ్గురి ప్రేమ కథలు కూడా కొనసాగుతున్న తరుణంలో ఊహించని విధంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఆ తర్వాత ఆ ముగ్గురి జీవితం ఎలా యూ టర్న్ తీసుకుంది? దూరమైన ఆ ప్రేమికులు చివరికి ఎలా కలుస్తారు? వచ్చిన సమస్యల్ని ఎలా ఎదుర్కొంటారు అనేది ఈ సినిమాలో అసలైన కథ.

విశ్లేషణ:
ట్రైలర్ తోనే మ్యాడ్ సినిమా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో చాలా సరదాగా కొనసాగుతుంది అని దర్శకుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేసి ఆడియన్స్ కు మైండ్ ను ఇటువైపుగా డైవర్ట్ చేశాడు. ముగ్గురు స్నేహితులు వారి ప్రేమ కథలు వారి అల్లరి ఇలా కథను కామెడీ పాయింట్స్ తో హైలెట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎక్కడా కూడా సీరియస్ సన్నివేశాలకు చోటు ఇవ్వలేదు. అలాంటి సీన్స్ పడే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆడియన్స్ ను నవ్వించడమే పని పెట్టుకున్నట్లు మంచి డైలాగ్స్ తో డిఫరెంట్ ప్రయత్నం అయితే చేసాడు. ముఖ్యంగా రైటింగ్ ని డిపార్ట్మెంట్ మెచ్చుకొని తీరాల్సిందే. 

కానీ అక్కడక్కడ డైలాగ్స్ కొన్ని వల్గర్ గా ఉండడం ఓవర్గం ఆడియన్స్ కు నచ్చకపోవచ్చు. కానీ కాలేజీ కుర్రోళ్ళు అన్నాక ఏ తరహాలో మాట్లాడుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి దర్శకుడు ఆ స్వేచ్ఛను గట్టిగానే తీసుకున్నాడు. ఇక ముగ్గురు హీరోలకు సంబంధించిన పాత్రలకు ఒక్కో తరహా డైమెన్షన్ హైలెట్ చేశారు. అయితే ఇందులో అందరికంటే ఎక్కువగా హైలైట్ అయింది మాత్రం దామోదర్ క్యారెక్టర్. వర్షం దర్శకుడు శోభన్ చిన్న కుమారుడు అయిన సంగీత శోభన్ ఈ సినిమాతో కంప్లీట్ కామెడీ యాంగిల్ లో మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు.

ఇక ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్ పాత్రను కాస్త సీరియస్గా ప్రజెంట్ చేశారు. సెకండ్ హాఫ్ లో మళ్ళీ కాస్త యాంగిల్ మార్చినప్పటికీ అదేమీ అంతగా సెట్ అవ్వలేదు. కేవలం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వలన యాక్షన్ తో హడావిడి చేసినట్లు అనిపిస్తుంది. కానీ కథకు మాత్రం కొన్ని సన్నివేశాలు అంతగా సెట్ అయినట్లుగా అనిపించదు. ఇక మరొక హీరో రామ్ నితిన్ స్మార్ట్ అండ్ స్టైలిష్ గా తన పాత్రకు కావలసినంత న్యాయం అయితే చేశాడు. కానీ ఇద్దరినీ మాత్రం కామెడీతో సంగీత్ గట్టిగానే డామినేట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో కూడా అతని క్యారెక్టర్ బాగా హైలెట్ అయింది. అల్లరి నరేష్ తరహాలోనే అతనికి మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాలో దర్శకుడు ప్రేమ కథలను కనెక్ట్ చేసిన విధానం బాగుంది అలాగే వాటిని కొనసాగించిన తీరు లో కూడా అతను పనితనాన్ని మెచ్చుకొని తీరాలి. కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ రొమాంటిక్ సీన్స్ కి అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అతను శృతి తప్పలేదు. మ్యాడ్ సినిమా పూర్తిగా కాలేజీ యువతను టార్గెట్ చేసి తీసినట్లే అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇలాంటి సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. కానీ కొత్త టైమింగ్ కామెడీతో దర్శకుడు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ కాలేజీ ప్రిన్సిపల్ ని ఏడిపించడం లాంటి సన్నివేశాలు అప్పుడెప్పుడో తేజ సినిమాలో వచ్చినవే. ఇక్కడ కూడా కాస్త అవి రొటీన్ గా అనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దర్శకుడు కామెడీ పంచ్ డైలాగ్స్ తో కొన్ని ఎపిసోడ్స్ తో థియేటర్లో నవ్వులు తెప్పించి బాగానే ఎట్రాక్ చేశాడు. చాలా రోజుల తర్వాత బెస్ట్ కామెడీ సినిమా వచ్చింది అని చెప్పవచ్చు. కొన్ని సీన్స్ రొటీన్ గా ఉండడం, మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. మ్యూజిక్ విషయం లో భీమ్స్ కాస్త బలాన్ని ఇచ్చి ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళేది. మరి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా కాలేజీ కుర్రోళ్లను ఎప్పటి వరకు థియేటర్లను నింపుతుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
👉కామెడి డైలాగ్స్
👉సంగీత్ శోభన్ సీన్స్
👉సెకండ్ హాఫ్క్

మైనస్ పాయింట్స్:
👉కొన్ని రొటీన్ ఎపిసోడ్స్
👉మ్యూజిక్

రేటింగ్: 2.75/5

Post a Comment

Previous Post Next Post