రాజ్ కుమార్ హీరాని తో చరణ్.. నిజమెంత?


రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా కొత్త సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే ఇప్పుడు అతను బాలీవుడ్ నెంబర్ వన్ దర్శకుడు రాజ్ కుమార్ హీరాని తో కూడా మరొక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా కొన్ని వార్తలు వైరల్ గా మారాయి.

ఇక ఇందులో నిజమెంత అని ఆరా తీయగా.. రాజ్ కుమార్ హీరాని సినిమా చేయడానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ ఇప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం ఆదర్శకుడు డుంకి సినిమాతో బిజీగా ఉన్నాడు..అది డిసెంబర్ లో రానుంది. అయితే రాజ్ కుమార్ ఒక కథను రాసుకుంటే స్క్రిప్ట్ కోసమే దాదాపు ఏడాది సమయం తీసుకుంటాడు. ఎంతో కాన్ఫిడెంట్ గా అనిపిస్తే గాని అతని స్క్రిప్ట్ ఓకే కాదు.

 ఇక హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ ముందుగానే వర్క్ షాప్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆయన సినిమాల్లో పెద్దగా యాక్షన్ ఎలివేషన్ సన్నివేశాలు ఉండకపోయినా ఎమోషన్స్ తోనే బాక్సాఫీస్ బ్లాస్ట్ చేయగలడు. అయితే రాజ్ కుమార్ రామ్ చరణ్ ఇటీవల ముంబైలో ప్రత్యేకంగా కలుసుకున్నారు. కానీ ప్రాజెక్టు కోసమే కలిసారా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ వీరి ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలి అంటే కనీసం ఏడాది వరకు ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post