అనిరుధ్ రేటు పెరిగింది.. ఇండియా నెంబర్ వన్!


సంచలన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రీసెంట్గా వచ్చిన జవాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంది. ఇక అతని ట్యూన్స్ పై కాస్త నెగటివ్ కామెంట్స్ వినిపించినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం మార్కెట్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

ఇంతకుముందు 10 కోట్ల రేంజ్ లోనే రెమ్యునరేషన్ అందుకుంటూ వస్తున్న అనిరుద్ ఇప్పుడు రాబోయే బాలీవుడ్ ప్రాజెక్టులకు సౌత్ ఇండియన్ ప్రాజెక్టులకు 15 నుంచి 20 కోట్ల మధ్యలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. రాబోయే రజనీకాంత్ రెండు మూడు సినిమాలకు కూడా అతనే మ్యూజిక్ అందించబోతున్నాడు.

ఇక RRR సినిమాతో కీరవాణి ఇటీవల కాలంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇక అంతకుముందు రెహమాన్ కూడా టాప్ లిస్టులోనే కొనసాగుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు వారి కంటే ఎక్కువ స్థాయిలోనే అనిరుధ్ కి డిమాండ్ పెరుగుతుంది. లోకేష్ కనగరాజు అట్లీ ఇద్దరు కూడా ఇప్పట్లో అతన్ని వదిలే అవకాశం లేదు. మరోవైపు ధనుష్ కమలహాసన్ లతో పాటు టాలీవుడ్ అగ్ర హీరోలు ఈ మ్యూజిక్ డైరెక్టర్ నే చూస్తున్నారు. రాబోయే రోజుల్లో అతని రేంజ్ ఇంకా ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post