మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల తండ్రితో ఒక ప్రాజెక్టు నిర్మించాలని అనుకున్న విషయం తెలిసింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఆ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి 2024 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. మరో మలయాళం కథను రీమేక్ గా తీసుకురాబోతున్నారు అని టాక్ వచ్చింది. అయితే భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లుగా ఇండస్ట్రీలో మరొక టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి రిస్క్ తీసుకోకుండా వశిష్ట దర్శకత్వంలో డిఫరెంట్ ప్రాజెక్టును మొదలు పెడుతున్నట్లు సమాచారం. అయితే కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టు క్యాన్సిల్ కావడం వలన నిర్మాత సుష్మితకు అటు ఇటుగా 1 కోటి వరకు నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు కథ ఇతర రైటర్స్ తో కలిసి చాలా నెలలుగా స్క్రిప్ట్ పై వర్క్ చేశారు. రైటర్స్ కు అడ్వాన్స్ కూడా గట్టిగానే ఇచ్చేశారు. ఇక నిరాశపరచకుండా ప్రాజెక్టు క్యాన్సిల్ అయినప్పటికీ కూడా స్క్రిప్ట్ పై వర్క్ చేసిన వారికి సెటిల్మెంట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ విధంగా మెగాస్టార్ ప్రాజెక్టు మొదలవకముందే కూతురికి కోటి వరకు నష్టం మిగిల్చిందని సమాచారం.
Follow
Post a Comment