సలార్.. రెండు సర్‌ప్రైజ్లు సాధ్యమేనా?


ఏడాది పాటు ఊరించి చివరి నిమిషంలో వాయిదా పడిన సలార్ సినిమా ఈ రేంజ్ లో షాక్ ఇస్తుంది అని ఎవరు ఊహించలేదు. సినిమా అవుట్ ఫుట్ విషయంలో పూర్తిగా సంతృప్తి చెందని దర్శకుడు రీ షూట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని సీజీ వర్క్స్ లో కూడా లోపాలు ఉండడంతో 100% అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేవరకు సినిమాను విడుదల చేయకూడదని ఫిక్స్ అయ్యారు. 

అయితే ఈ వాయిదా తో ఇప్పటికే సినిమాపై చాలా నెగిటివిటి క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో మళ్లీ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యేలా రెండు సర్ ప్రైజ్ లలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సలార్ టీమ్ రెండు థియేట్రికల్ ట్రైలర్‌లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఒక ట్రైలర్‌ను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23 న విడుదల చేయాలని. ఇక రిలీజ్ తేదీకి ముందు 2 వ ట్రైలర్‌ను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. టీజర్ లో అసలు ప్రభాస్ ఫేస్ చూపంచని టీమ్ అసలు రెండు ట్రైలర్స్ ను రిలీజ్ చేస్తుందా లేదా అనేది డౌట్ గా మారింది. చూడాలి మరి ఏం జరుగుతోంది.

Post a Comment

Previous Post Next Post