విజయ్ దేవరకొండ.. 100 కోట్ల బడ్జెట్!


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో కూడా మరో ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. అంతకుముందే లైగర్ సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ చూసిన విజయ్ ఖుషి సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు రాబోయే సినిమాలపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ముఖ్యంగా విజయ్ కెరీర్లో మొదటిసారి అత్యధిక భారీ బడ్జెట్లో మరో సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. 

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం సితార ఎంటర్టైర్మెంట్స్ ఏకంగా 100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు నిర్మాత నాగం వంశీ క్లారిటీ ఇచ్చేశారు. విజయ్ దేవరకొండకు పర్ఫెక్ట్ కథ పడితే మరొక లెవెల్ లో ఉంటుంది అని ఇప్పుడు రాబోయే సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది అని నిర్మాత వివరణ ఇచ్చాడు. ఇదొక పక్కా కమర్షియల్ మూవీ అవుతుంది అని అనిరుద్ తన మ్యూజిక్ తో సినిమా షేప్ మార్చేయగలడు అని ఆయన నమ్మకంగా తెలియజేశారు. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post