ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏఆర్ రెహమాన్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి RRR తో ఒక రికార్డును క్రియేట్ చేశాడు. ఆ సినిమాకు దాదాపు 18 నుంచి 20 కోట్ల మధ్యలో ఆయన పారితోషకం అయితే తీసుకున్నారు. రాజమౌళి ప్రతి సినిమాకు కూడా ఎక్కువ స్థాయిలోనే ఆదాయం అందుతూ వస్తోంది. అయితే మిగతా సినిమాల విషయంలో మాత్రం కీరవాణి పేమెంట్ లెక్కలు మాత్రం డిఫరెంట్ గా ఉంటున్నాయి.
అందుకు కారణం ప్రతి సినిమా కూడా రాజమౌళి రేంజ్ లో ఉండదు కాబట్టి. కీరవాణి వీలైనంతవరకు తనకు సన్నిహితులైన వారితో సినిమా చేసేందుకు నో చెప్పకుండా ఉండలేరు. అలాగని కంటెంట్ మరి దారుణంగా ఉంటే కూడా ఒప్పుకోరు. RRR సినిమా తర్వాత యాంకర్ సుమ మెయిన్ లీడ్ లో నటించిన జయమ్మ పంచాయతీకి ఆయన 5 కోట్ల కంటే తక్కువ తీసుకున్నారు. ఇక ఇప్పుడు నాగార్జున నా సామీ రంగా సినిమాతో పాటు మెగాస్టార్ 150 సినిమా కూడా ఆయన వర్క్ చేస్తున్నారు అయితే ఈ సినిమాల పేమెంట్స్ 6 నుంచి 8 కోట్ల రేంజ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వంలోకి అడుగుపెడుతున్న వైవిఎస్ చౌదరి సినిమా కోసం కూడా ఆయన చాలా తక్కువ స్థాయిలోనే పారితోషకం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు కారణం గతంలో వైవిస్ చౌదరి కీరవాణి మంచి రెమ్యునరేషన్ ఇచ్చి తన సినిమాలకు మ్యూజిక్ తీసుకున్నాడు. ఇప్పుడాయనా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి అందుకే దర్శకుడు పరిస్థితిని ఆలోచించి, తక్కువ బడ్జెట్ సినిమా కాబట్టి కీరవాణి మూడు కోట్లలో రేంజ్ లోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
Follow
Follow
Post a Comment