జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాకు గాను సైమా వేడుకలో బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడు. అయితే ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడడం చాలా వైరల్ అవుతుంది. నా సంతోషంలో నా కష్టాల్లో అలాగే నేను ఎప్పుడు డౌన్లో ఉన్నా కూడా వారు నాపై చూపించే ప్రేమ ఎప్పటికీ మరువ లేనిది అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఏకంగా పాదాభివందనం అని కూడా అనేశాడు.
ఫ్యాన్స్ పై ఎల్లప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ కి అమితమైన ప్రేమ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ స్థాయిలో ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వడం చూస్తుంటే రీసెంట్ గా జరిగిన పరిణామాలే అందుకు కారణం అని తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో చాలా వరకు టిడిపి ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ స్పందించాలి అని సోషల్ మీడియాలో చాలా గొడవ చేశారు.
అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం చాలా సపోర్ట్ చేశారు. అసలు ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి అని ఈ రాజకీయ గొడవల్లోకి ఎన్టీఆర్ ని ఎందుకు లాగుతున్నారు అంటూ మద్దతు ఇచ్చారు. ఒక విధంగా నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ నారావారి ఫ్యాన్స్ అన్నట్టుగా సోషల్ మీడియాలో పెద్దగా యుద్ధాలు జరిగాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సైమా వేడుకకు హాజరై అక్కడ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడం, కష్టాల్లో కూడా తోడుగా ఉంటున్నారు అనే విధంగా అనడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో టాపిక్ మరింత వైరల్ అవుతుంది.
Follow
Follow
Post a Comment