ప్రభాస్ సలార్ సినిమా హడావిడి ఈపాటికి మొదలవ్వాల్సింది కానీ ఊహించని విధంగా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదల డేట్ పై చాలా రకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నప్పటికీ నిర్మాణ సంస్థ ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు అనే విషయం కూడా అర్థం కావడం లేదు. ఇక మరోవైపు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి కూడా నిర్మాతలపై గట్టిగానే పెరుగుతుంది.
ఈ క్రమంలో విడుదల డేట్ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి అని కూడా వారు కోరుతున్నారు. అయితే మొదట 2024 సంక్రాంతికి అయితే బెటర్ అని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అయితే ఒత్తిడి వచ్చింది. కానీ నిర్మాతలు అది సరైన టైమ్ కాదు అని అనుకుంటున్నారు. సౌత్ లో సంక్రాంతికి బెస్ట్ టైం అయినప్పటికీ నార్త్ లో అంతగా రెస్పాన్స్ అయితే ఉండదు. నవంబర్ లేదా డిసెంబర్ అయితేనే అన్ని ఇండస్ట్రీలలో బెటర్ బిజినెస్ వుంటుంది. సంక్రాంతి డేట్ గురించి అయితే నిర్మాతలు సీరియస్ గా ఆలోచించడం లేదు. ఎక్కువగా అయితే నవంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Follow
Post a Comment