ప్రతి దర్శకుడికి కూడా జీవితంలో ఒక డ్రీం ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. రాజమౌళి మహాభారతం సినిమాను ఎప్పటికైనా తెరపైకి తీసుకు వస్తాను అని చాలా సార్లు చెప్పాడు. ఇక పూరి జగన్నాథ్ కూడా ఎన్నోసార్లు తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన అనే తెలియజేశాడు. ఇక ఈ ప్రాజెక్టును మొదట పవన్ కళ్యాణ్ నుంచి ఆ తర్వాత మహేష్ బాబుకు చేరుకుంది.
కానీ ఎవరు కూడా దానిపై అంతగా ఆసక్తిని చూపించలేదు. ఇక ఫైనల్ గా పూరి విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు అధికారికంగా స్టార్ట్ కూడా చేశాడు. కానీ ఆ సినిమా హడావిడి వరకే సరిపోయింది. లైగర్ దెబ్బకు విజయ్ దేవరకొండ మళ్ళీ పూరితో సినిమా చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక ఈ ప్రాజెక్టును తెలుగు హీరోలతో చేస్తే వర్కౌట్ కాదు అని పూరి జగన్నాథ్ బాలీవుడ్ హీరోలతో చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కరణ్ జోహార్ కూడా అతనికే సపోర్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూరి డబుల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు అనంతరం జనగణమన ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Follow
Post a Comment