షారుక్ ఖాన్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన జవాన్ సినిమా తెలుగులో కూడా గ్రాండ్ గానే విడుదలైంది. అయితే ఈ సినిమాకు పోటీగా తెలుగులో అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి దిగింది. ఒక విధంగా ఈ తెలుగు సినిమానే జవాన్ కు తెలుగులో ఎఫెక్ట్ చూపే అవకాశం ఉన్నట్లుగా అనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు అయ్యేలా కనిపిస్తోంది.
జవాన్ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా డోస్ పెంచే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమాలో నయనతార విజయ్ సేతుపతి ఉండడం కూడా సౌత్ మార్కెట్లో కొంత డిమాండ్ అయితే ఏర్పడింది. ఇక ఇప్పుడు జవాన్ మొదటి షో నుంచే పాజిటివ్ రియాక్షన్ అందుకుంటుంది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే క్లిక్ అయినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సమావేశాలను దర్శకుడు బాగా హైలెట్ చేసినట్లుగా తెలుస్తోంది. షారుఖ్ విభిన్నమైన పాత్రలలో నటించడం దానికి తోడు విజయ్ సేతుపతి నటన కూడా ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచినట్లు తెలుస్తోంది. మొత్తానికి జవాన్ సినిమా అయితే తెలుగు మార్కెట్లోనే కాకుండా అటు తమిళం మలయాళం ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ పోటీని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఏ విధంగా తట్టుకుంటుందో చూడాలి.
Follow
Follow
Post a Comment