విశాల్ - విజయ్ జస్ట్ మిస్!


లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న లియో సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అనేక రకాల గాసిప్స్ అయితే ఇప్పటికే సినిమాపై అంచనాల స్థాయిని అమాంతంగా పెంచేసాయి. అయితే ఈ సినిమాలో విజయ్ తో పాటు విశాల్ కూడా ఒక పాత్రలో తీసుకోవాలని దర్శకుడు అనుకున్నాడు. 

అది హీరోతో ఉండే సమానమైన పాత్ర కాదు. పవర్ఫుల్ విలన్ గా అతన్ని ప్రజెంట్ చేయాలని దర్శకుడు అనుకున్నాడు. లియో సినిమాలో అర్జున్ దాస్ చేస్తున్న పాత్ర కోసం మొదట విశాల్ ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ అప్పటికే విశాల్ డేట్స్ మరొక సినిమా కోసం ఇవ్వాల్సి వచ్చింది. ఆ ప్రాజెక్టుతో చాలా బిజీగా ఉండడంతో లియో సినిమాకు డేట్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఆ విషయాన్ని విశాల్ కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. దర్శకుడు కూడా తన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు అని విశాల్ వివరణ ఇచ్చాడు

Post a Comment

Previous Post Next Post