అనిరుధ్ కూడా గిఫ్ట్ కొట్టేశాడోచ్


సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 600 కోట్లకి పైగా కలెక్షన్స్ ని ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇప్పటికి తమిళనాట జైలర్ మూవీకి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి.  ఇక జైలర్ సినిమా భారీ లాభాలు తీసుకురావడంతో నిర్మాత కళానిధి మారన్ సూపర్ స్టార్ రజినీకాంత్ రెమ్యునరేషన్ కాకుండా అదనంగా వంద కోట్లు ఇచ్చారు.

అలాగే బిఎండబ్యూ కారుని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే దర్శకుడు నెల్సన్ దిలీప్ కి కూడా ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు అనిరుద్ వంతు వచ్చింది. జైలర్ సక్సెస్ లో మేజర్ షేర్ అనిరుద్ కి ఉందని చెప్పాలి. అతను ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మూవీని ఎక్కడో నిలబెట్టింది. పవర్ ఫుల్ ఎలివేషన్స్ తో ప్రేక్షకులకి కనెక్ట్ కావడానికి కారణం అయ్యింది. దీంతో నిర్మాత మారన్ అనిరుద్ ని ఆఫీస్ కి పిలిపించారు. మూడు ఖరీదైన కార్లు తీసుకొచ్చి పెట్టి వాటిలో నచ్చింది సెలక్ట్ చేసుకోమని చెప్పారు. దీంతో అనిరుద్ Porsche కారుని టెస్ట్ డ్రైవ్ చేసి గిఫ్ట్ గా తీసుకున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ కారు ఖరీదు 1.80 కోట్ల రూపాయిలకి పైగా ఉండటం విశేషం. 

Post a Comment

Previous Post Next Post