మాస్ కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం స్కంద సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని సిద్ధమవుతున్నాడు. సలార్ డేట్ పై ఫోకస్ పెట్టిన చిత్ర యూనిట్ సభ్యులు మరింత ప్రమోషన్స్ కూడా పెంచాలి అని అనుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో దర్శకుడు బోయపాటి సినిమాకు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక తన భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా బోయపాటి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బాలకృష్ణతో ఒక సినిమా చేసేందుకు ఒక స్టోరీ లైన్ కూడా సిద్ధం చేశాడు. అయితే బాలకృష్ణ అల్లు అర్జున్ తో కూడా ఒక మల్టీస్టారర్ ఉంటుంది అని అప్పట్లో ఒక హింట్ అయితే ఇచ్చారు. కానీ ఆ విషయంలో మాత్రం మళ్లీ ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే పాన్ ఇండియా మార్కెట్ ను అందుకుంటున్న బన్నీతో మరో సోలో హీరోగా పవర్ ఫుల్ సినిమా చేయాలి అని బోయపాటి కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వీరి కలయికలో ఇదివరకే సరైనోడు వచ్చింది
ఇటీవల మరోసారి బన్నీ దగ్గరికి వెళ్లి కొత్త కథపై చర్చలు జరిపినట్లు టాక్ అయితే వినిపిస్తోంది. అయితే స్కంద తరువాత బాలకృష్ణ తో సినిమా చేయాలని అనుకుంటున్న బోయపాటి అనంతరం అల్లు అర్జున్ తో కూడా ముందుగానే కథను ఓకే చేయించుకోవాలి అని అనుకుంటున్నాడు. మరి బన్నీ ఈ విధంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.
Follow
Post a Comment