టాలీవుడ్ రౌడి స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి సినిమా సెలబ్రెషన్స్ లో 100 ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు డొనేట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కోటి రూపాయల వరకు సంతోషంగా షేర్ చేస్తున్నట్లు విజయ్ చెప్పిన దానిపై 'అభిషేక్ పిక్చర్స్' వారు సోషల్ మీడియాలో చేసిన కామేంట్ ఆశ్చర్యం కలిగించింది.
విజయ్ దేవరకొండ గత చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేసి 8 కోట్ల వరకు నష్టపోయాం అని డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా ఫ్యామిలీలు ఉంటాయి కాబట్టి విజయ్ ఆ విషయం గురించి ఎందుకు ఆలోచించ లేదని కాస్త అతిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
ఎందుకంటే హీరో సినిమాల మీద లాభాలు వస్తే ఏ హీరోకు కూడా డిస్ట్రిబ్యూటర్ వాటా అయితే ఇవ్వరు. డిమాండ్ ను బట్టి వారే ఒక బిజినెస్ తరహాలో డీల్స్ సెట్ చేసుకుంటూ ఉంటారు. విజయ్ గత సినిమాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల వర్షం కురిపించాయి. లాభాలు వస్తే హ్యాపీగా తీసుకునే డిస్ట్రిబ్యూటర్స్ ఇలా నష్టాలు వచ్చినప్పుడు హీరోలు కూడా పరిహారం చెల్లించాలని కోరడం ఎంతవరకు కరెక్ట్? అనేలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Follow
Follow
Post a Comment