అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అతని దర్శకుల లైనప్ మాత్రం పెరిగిపోతూనే ఉంది. సందీప్ రెడ్డి వంగతో అధికారికంగా ఒక ప్రాజెక్టు కూడా ప్రకటించేశారు. అలాగే త్రివిక్రమ్ తో కూడా సినిమా ఉంటుంది అని మరో క్లారిటీ వచ్చేసింది. ఇక రీసెంట్గా అట్లీ తోపాటు నెల్సన్ దిలీప్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి. ఇద్దరు కూడా బన్నీని కలిసి స్టోరి పాయింట్స్ గురించి చర్చించారు అని ఇండస్ట్రీలో ఒక బలమైన టాక్ అయితే వినిపించింది.
అట్లీ అయితే కథ చెప్పినట్లుగా ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలియజేశాడు. నిజానికి బన్నీ మాట ఇచ్చి ఉండవచ్చు కానీ ఇచ్చిన మాట ప్రకారం బన్నీతో వర్కౌట్ అవుతుంది అనుకుంటే దర్శకులకు రివర్స్ షాక్ తగిలిన తగలవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది దర్శకులతో కథ ఓకే చేసిన తర్వాత కూడా ప్రాజెక్టులను క్యాన్సల్ చేసుకున్నాడు.
అందుకు కారణం ముందుగా దర్శకులు మెయిన్ కథను చెప్పే ఒప్పించినప్పటికీ ఆ తర్వాత ఫైనల్ స్క్రిప్ట్ చర్చల్లో మాత్రం ఫెయిల్ అవుతూ వచ్చారు. ఫైనల్ స్క్రిప్ట్ డౌట్ అనిపిస్తే బన్నీ నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తాడు. అలా రిజెక్ట్ అయిన లిస్టులో లింగు స్వామి మురగదాస్ కూడా ఉన్నారు. ఇక కొరటాల శివ, వేణు శ్రీరామ్ లాంటి దర్శకులతో కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ వివిధ కారణాల వలన వెనుకడుగు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వినిపిస్తోంది. కానీ బన్నీకి నచ్చే విధంగా అతను కథ చెబితేనే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది.
Follow
Follow
Post a Comment