పుష్ప రాజ్.. అమ్మాయి అలవాట్లు?


అల్లు అర్జున్ పుష్ప సినిమా 2024 ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతున్నట్లు ఇటీవల అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ పోస్టర్ కూడా ఓ వర్గం ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ప్రతి పోస్టర్ లో కూడా ఏదో అంశాన్ని హైలెట్ చేసే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాలో కూడా అందరూ మాట్లాడుకునేలా మరొక పాయింట్ ను అయితే ఎలివేట్ చేశాడు.

అదే అల్లు అర్జున్ చేతిని చాలా ప్రత్యేకంగా పోస్టర్లో హైలెట్ చేశారు. ప్రతి వేలికి ఒక్క ఉంగరం ఉండడంతో దీనికి కూడా ప్రత్యేకత ఉందని తెలుస్తోంది. అయితే చిటికెన వేలు మాత్రం అమ్మాయిల స్టైల్  లో ఉంది అన్నట్లుగా సోషల్ మీడియాలో మరో కొత్త చర్చ తెరపైకి వస్తోంది. ఇదేదో అమ్మాయి తరహా అలవాటులా ఉంది అంటూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు.

అయితే ఆ విధంగా గోరు పెంచుకుని అమ్మాయిల తరహాలో నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన రీజన్ కూడా కథలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పుష్పరాజ్ క్యారెక్టర్ కు సంబంధించిన ఒక అంశాన్ని హైలైట్ చేసేందుకే ఆ గోరును సినిమాలో చూపించబోతున్నారట. ఆ కాలంలో అదొక డిఫరెంట్ స్టైల్ అని ఒక టాక్ వస్తుండగా.. హీరోయిన్ కోసమే పుష్పరాజ్ ఆ విధంగా గోరును పెంచుకొని దానికి నెయిల్ పాలిష్ కూడా పెట్టుకున్నాడు అని మరొక టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా వెండితెర పైకి వచ్చే వరకు ఆగాల్సిందే..

Post a Comment

Previous Post Next Post