మొదట్లో కాస్త డిఫరెంట్ కంటెంట్ కథలను సెలెక్ట్ చేసుకున్నట్లు కనిపించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత మళ్లీ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లోకి రావడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. మాస్ ఫాలోయింగ్ సంపాదించుకోవాలి అని అతను చేసిన మీటర్ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఇక మళ్లీ కామెడీ రొమాంటిక్ యాంగిల్ లో తన మార్కెట్ను కాపాడుకునేందుకు రూల్స్ రంజాన్ అనే సినిమాతో రాబోతున్నాడు.
అలాగే మరికొన్ని కథలను కూడా లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో అతనికి బేబీ దర్శకుడి నుంచి ఒక ఆఫర్ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. బేబీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 90 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ చూపించిన దర్శకుడు సాయి రాజేష్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే అతను బేబీ సినిమా కంటే ముందే కిరణ్ అబ్బవరం తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక బేబీ సినిమా సక్సెస్ తో అతని రేంజ్ కాస్త పెరిగింది. మరి ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో అతను సినిమా చేస్తాడో లేదో చూడాలి.
Follow
Post a Comment